Weight Tips: పడుకునే ముందు ఇలా చేస్తే.. గుట్ట కూడా ఇట్టే కరగాల్సిందే.! ట్రై చేయండి

పని ఒత్తిడి, టైంకి భోజనం సరిగ్గా చేయకపోవడంతో చాలామంది ఈ మధ్య ఊబకాయంతో సతమతమవుతున్నారు. ఇక ఆ గుట్టలాంటి పొట్టను తగ్గించేందుకు డైటింగ్ స్టార్ట్ చేయడం లేదా.. రైస్ మానేయడం లాంటివి చేస్తుంటారు కొందరు.

Ravi Kiran

|

Updated on: Sep 23, 2024 | 5:45 PM

మీరు మీ బరువును అదుపులో ఉంచుకోవాలనుకుంటే, మీ జీవనశైలిని సరిగ్గా ఉంచుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. శరీర బరువు ఆరోగ్యంగా ఉంటే మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించవచ్చు. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

1 / 7
 సాసేజ్‌లు, బేకరీ స్నాక్స్‌లో చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. సాయంత్రం పూట వీటిని తినడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

2 / 7
రాత్రి 7 గంటలకు ముందు డిన్నర్:   మీరు బరువు తగ్గాలనుకుంటే రాత్రి 7 గంటలలోపు డిన్నర్ తినడం అలవాటు చేసుకోండి. రాత్రి భోజనానికి, పడుకునే సమయానికి మధ్య దాదాపు 3 గంటల గ్యాప్ ఉండాలి. అర్ధరాత్రి వేళ భోజనం చేయడం వల్ల జీర్ణం సరిగ్గా అవ్వదు. ఇది జీవక్రియను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే, సాయంత్రం త్వరగా తినడం అలవాటు చేసుకోండి.

3 / 7
తేలికపాటి ఆహారాన్ని తినండి:   రాత్రిపూట ఎల్లప్పుడూ తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. బరువు తగ్గడానికి డిన్నర్‌లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని డైట్ ప్లాన్‌లో ఉంచుకోండి. రాత్రిపూట మీరు పచ్చి కూరగాయలు, సూప్, సలాడ్ లాంటివి తినవచ్చు. మీకు అర్థరాత్రి ఆకలిగా అనిపిస్తే, దోసకాయ లేదా ఆపిల్ తినవచ్చు.

4 / 7
మధ్యాహ్నం నిద్ర శరీరానికి మంచిదా? చెడ్డదా..? మీ ఆరోగ్యంపై మధ్యాహ్నం నిద్ర ప్రభావం ఎలా ఉంటుందో వంటి వివరాలు నిపుణుల మాటల్లో.. సాధారణంగా 7 నుంచి 8 గంటల నిద్ర మంచిదని వైద్యులు చెబుతుంటారు. చాలా సార్లు ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ఇతర కారణాల వల్ల ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది. అటువంటి వారికి మధ్యాహ్నం నిద్ర అవసరం. పెరుగుతున్న పనిభారం, బిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడితో కూడిన పరిస్థితులతో ఉన్న వ్యక్తులకు, మధ్యాహ్నం నిద్ర రిఫ్రెష్‌గా అనిపిస్తుంది.

5 / 7
పసుపు పాలు తాగడం:   పసుపు పాలు బరువు తగ్గడానికి, మంచి నిద్రకు సహాయపడుతాయి. పసుపులో కొవ్వును కరిగించడానికి సహాయపడే థర్మోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. దీనితో పాటు, ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగండి.

6 / 7
కనీసం 7 గంటల నిద్ర:   ఊబకాయంతో నిద్రకు సంబంధం ఉంది. బరువు తగ్గడానికి కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం. మీకు తగినంత నిద్ర లేకపోతే, అది మీ జీవక్రియను తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గడం కష్టతరం అవుతుంది.

7 / 7
Follow us