Hyderabad: 3 నిమిషాల్లో రూ. 1.10 కోట్లు.. కట్‌ చేస్తే.. ఆ తర్వాత 25 నిమిషాల్లో సీన్ ఇది

హైదరాబాద్‌కు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్‌కు సెప్టెంబర్ 27 ఉదయం మూడు మెసేజ్‌లు వచ్చాయి. 10.09 నుంచి 10.11 గంటల వ్యవధిలో అంటే.. మూడు నిమిషాల వ్యవధిలో రూ.50 లక్షలు రెండుసార్లు.. రూ.10 లక్షలు ఒకసారి..

Hyderabad: 3 నిమిషాల్లో రూ. 1.10 కోట్లు.. కట్‌ చేస్తే.. ఆ తర్వాత 25 నిమిషాల్లో సీన్ ఇది
Follow us
Ranjith Muppidi

| Edited By: Ravi Kiran

Updated on: Sep 26, 2024 | 8:28 PM

హైదరాబాద్‌కు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్‌కు సెప్టెంబర్ 27 ఉదయం మూడు మెసేజ్‌లు వచ్చాయి. 10.09 నుంచి 10.11 గంటల వ్యవధిలో అంటే.. మూడు నిమిషాల వ్యవధిలో రూ.50 లక్షలు రెండుసార్లు.. రూ.10 లక్షలు ఒకసారి.. అంటే మొత్తంగా రూ.1.10 కోట్ల భారీ మొత్తం వేరే ఖాతాలకు బదిలీ అయినట్లుగా బ్యాంక్ నుంచి మెసేజ్‌లు వచ్చాయి. వెంటనే హర్ష గుండె జారినంత పనైంది. తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావడంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఆ వెంటనే తేరుకున్న అతడు.. కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేశాడు.

నిమిషాల వ్యవధిలో అంటే 10.22 గంటల వేళలో 1930 నెంబర్‌కు ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించాడు. వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్.. జరిగిన మోసానికి సంబంధించి సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టం సిబ్బందిని రంగంలోకి దించింది. తెలంగాణలో ఈ మోసం జరగడంతో వెంటనే రియాక్ట్ అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్‌లోకి వచ్చేసింది.

బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి బదిలీ అయిన మొత్తం విషయంపై యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ప్రతినిధుల్ని అప్రమత్తం చేసింది స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి.. నిధుల్ని డ్రా చేయకుండా పుట్ ఆన్ హోల్డ్ చేశారు. ఇదే విషయాన్ని బాధితుడికి రూ.10.42 గంటల వేళలో ఫోన్‌కు మెసేజ్ చేశారు. సైబర్ నేరస్తులు దోచేసిన రూ.1.10 కోట్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే నేరస్తులు డ్రా చేయగలిగారు. దీంతో డ్రా చేసిన బ్యాంకు ఖాతాను బెంగళూరులోని ఖాతాలుగా గుర్తించారు. బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఇవి కూడా చదవండి

దీనిపై పోలీసులు ఫోకస్ చేశారు. సైబర్ నేరస్తుల బారిన ఎవరు పడినా..! నిమిషాల్లో స్పందించి ‘1930’కు ఫోన్ చేస్తే.. డబ్బులు డ్రా కాకుండా అడ్డుకునే వీలుందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని.. 1930 నెంబర్‌ మీద అవగాహన పెంచుకోవాలని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

ఇది చదవండి: ఓర్నీ ప్రేమ సల్లగుండా.! భార్య బికినీ కోసం ఏకంగా ఇన్ని వందల కోట్లా.? అదేంటంటే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!