Viral: ఓర్నీ ప్రేమ సల్లగుండా.! భార్య బికినీ కోసం ఏకంగా ఇన్ని వందల కోట్లా.? అదేంటంటే
సాధారణంగా ఏ భర్త అయినా భార్యకు బహుమతి ఇవ్వాలంటే.. ఏం ఇస్తారు.! ఓ చీర, లేక నగో లేదా షాపింగ్ వెళ్లేందుకు కొంత డబ్బో ఇస్తాడు. దాదాపుగా ప్రతీ భర్త చేసేది ఇదే. కానీ దుబాయ్‌కు చెందిన ఓ బిజినెస్‌మెన్ మాత్రమే ఏకంగా..
సాధారణంగా ఏ భర్త అయినా భార్యకు బహుమతి ఇవ్వాలంటే.. ఏం ఇస్తారు.! ఓ చీర, లేక నగో లేదా షాపింగ్ వెళ్లేందుకు కొంత డబ్బో ఇస్తాడు. దాదాపుగా ప్రతీ భర్త చేసేది ఇదే. కానీ దుబాయ్‌కు చెందిన ఓ బిజినెస్‌మెన్ మాత్రమే ఏకంగా వందల కోట్లు పెట్టి ఏం కొన్నాడో తెలిస్తే అవాక్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం ఈ భార్యాభర్తల స్వీట్ గిఫ్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్‌కు చెందిన జమాల్ అల్ సదాక్ అనే మిలియనీర్ తన భార్య సౌదీ అల్ నదాక్ కోసం ఏకంగా రూ. 418 కోట్లు పెట్టి హిందూ మహాసముద్రంలోని ఓ ద్వీపాన్ని కొనేశాడు. ఇంతకీ అతడెందుకు ఇది కొన్నాడంటే.? అతడి భార్య బికినీ ధరించాలని ఉందని ఆమె మనసులోని కోరిక బయటపెట్టిందట. ఇక ఆమె బీచ్‌లో సురక్షితంగా సేద తీరాలన్నది భర్త చిరకాల కోరిక. ఇంకేముందు భార్య కోసమన్ ఏకంగా మిలియన్లు వెచ్చించి మరీ ఓ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. ఇక ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
‘తాను బికినీ ధరించాలని చెప్పడంతో.. నా మిలియనీర్ భర్త ఓ ద్వీపాన్ని కొనుగోలు చేశాడని’ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు వరుస కామెంట్లతో హోరెత్తించారు. ఇదొక్కటే కాదు భార్య పుట్టినరోజు ఈ ఏడాది మే నెలలో జరగడంతో.. ఆ సమయంలో సుమారు రూ. 50 లక్షలు ఖర్చు చేసి మరీ బర్త్ డే జరిపాడట.
ఇది చదవండి: అనారోగ్యంతో ఆస్పత్రికొచ్చిన యువతి.. ఆమె ఎక్స్‌రే చూడగా డాక్టర్లు షాక్
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..