- Telugu News Photo Gallery Ask Your Partner These Questions Before Marriage, Know the relationship tips
అబ్బాయిలూ పెళ్లికి రెడీ అవుతున్నారా.? అమ్మాయిలను ఈ ప్రశ్నలు కచ్చితంగా అడగండి
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. మన లైఫ్‌లోకి సరైన భాగస్వామి ఎంటరైతే.. జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పెళ్లి అనే బంధం బలంగా మారాలంటే.. ఆ వివరాలు ఇలా..
Updated on: Sep 21, 2024 | 12:45 PM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. మన లైఫ్‌లోకి సరైన భాగస్వామి ఎంటరైతే.. జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పెళ్లి అనే బంధం బలంగా మారాలంటే.. ఒకరినొకరు ప్రేమతో, నమ్మకంతో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక ప్రస్తుత యువత పెళ్లికి ముందే ప్రతీ విషయాన్ని స్వేచ్చగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి పెళ్లి చేసుకోవడానికి సిద్దంగా ఉన్న ఏ జంట అయినా.. పెళ్లికి ముందు తమ భాగస్వామిని ఈ ప్రశ్నలు తప్పనిసరిగా అడగాలి.

ఆర్ధిక విషయాలపై చర్చించండి: పెళ్లి చేసుకునే దంపతులు తమ ఆర్థిక లక్ష్యాల గురించి ఎలప్పుడూ చర్చించుకోవడం మంచిది. ఎలా పొదుపు చేయాలి.? భవిష్యత్తులో ఆర్థికంగా ఎలా ముందుకెళ్లాలి.? అనే విషయాలపై చర్చించుకోవడం చాలా ముఖ్యం. ఒకరికొకరు ఆర్ధికంగా వృద్ది చెందారో లేదో అనే విషయాలను తెలుసుకోవడం మంచిది.

పిల్లలు గురించి చర్చ: పిల్లలను ఎప్పుడు కనాలి.? దాని కోసం ఎలా సిద్ధం కావాలనేది కూడా భార్యాభర్తలు పెళ్లికి ముందు చర్చించుకోవాలి. వైవాహిక జీవితంలో ఇది చాలా ముఖ్యం. ఇదొక్కటే కాదు వ్యక్తిగత సమస్యలపై ఇద్దరూ చర్చించుకోవాలి.

కమ్యూనికేషన్ ఇంపార్టెంట్: ఇద్దరి మధ్య శారీరక సాన్నిహిత్యం ఎంత ముఖ్యమో, ఒకరికొకరి అవసరాల గురించి కూడా మాట్లాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇలా మాట్లాడుకుంటే ఇద్దరి మధ్య వాదోపవాదాలు, గొడవలు తగ్గుతాయి.

కెరీర్ లక్ష్యాలను చర్చించుకోవడం: ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నట్లయితే, కెరీర్ లక్ష్యాలను చర్చించడం అవసరం. పెళ్లయ్యాక ఇల్లు, ఉద్యోగం నిర్వహించడం స్త్రీకి కష్టంగా ఉండవచ్చు. అందుకే భార్యతో పాటు భర్త కూడా అప్పుడప్పుడూ ఇంటి పనుల్లో సాయం చేస్తుండాలి.

ఆధ్యాత్మిక విషయాలపై చర్చ: ఒకరికొకరి ఉన్న ఆధ్యాత్మికత విషయాలు, విలువలపై చర్చించుకోవడం చాలా ముఖ్యం. ఇది రాబోయే రోజుల్లో భార్యాభర్తలిద్దరికీ తమ వ్యక్తిగత భావాలు దెబ్బతీయకుండా చేస్తుంది.

బాధ్యతలను పంచుకోండి: వివాహం తర్వాత, ఇద్దరూ పనికి వెళితే.. ఒకరిపైనే పూర్తిగా బాధ్యతల భారం పడకుండా.. వాటిని ఎలా పంచుకోవాలో మాట్లాడుకోండి. భవిష్యత్తులో వివాదాలు రాకుండా ఉంటాయి.

బలాలు, బలహీనతలు తెలుసుకోవడం: జంటగా, ఇద్దరూ తమ బలాలు, బలహీనతలను తెలుసుకోవడం ముఖ్యం. ఇది భార్యాభర్తల మధ్య అనుకూలతను పెంచుతుంది.




