Viral: ఆ 5 రోజులు బట్టలు లేకుండానే మహిళలు.. మగాళ్లూ అలా.! ఎందుకో తెల్సా

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివాహానికి విభిన్న సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని చోట్ల పెళ్లి తర్వాత బట్టలు చింపుకునే ఆచారం ఉంటే.. మరికొన్ని చోట్ల వధూవరులను వేర్వేరు గదుల్లో ఉంచే ఆచారం ఉంది. అయితే ఇప్పుడు మనం పూర్తిగా..

Viral: ఆ 5 రోజులు బట్టలు లేకుండానే మహిళలు.. మగాళ్లూ అలా.! ఎందుకో తెల్సా
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 23, 2024 | 4:47 PM

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివాహానికి విభిన్న సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని చోట్ల పెళ్లి తర్వాత బట్టలు చింపుకునే ఆచారం ఉంటే.. మరికొన్ని చోట్ల వధూవరులను వేర్వేరు గదుల్లో ఉంచే ఆచారం ఉంది. అయితే ఇప్పుడు మనం పూర్తి భిన్నమైన సంప్రదాయం గురించి తెలుసుకోబోతున్నాం.

వివరాల్లోకి వెళ్తే.. హిమాచల్ ప్రదేశ్‌లోని మణికర్ణ లోయలోని పిని గ్రామ ప్రజలు వివాహానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఇక్కడ పెళ్లి చేసుకున్న మహిళలు సంవత్సరంలో 5 రోజులు ఎలాంటి దుస్తులు ధరించరు. భార్యభర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు గానీ.. ఒకరికొకరు మాట్లాడుకోరు. ఇద్దరూ ఎవరికి వారే తెలియనట్టుగా ఉంటారు. ఈ 5 రోజుల్లో ఆడవాళ్లు మగవాళ్ల ముందుకి రారు, ఇంట్లో తాళం వేసి ఉండరు, నవ్వరు కూడా. ఇంటి పని నుంచి ప్రతి పనిని దుస్తులు వేసుకోకుండానే చేస్తారు. ఇలా చేయకపోతే వారికే కాదు.. గ్రామానికి కూడా అరిష్టమని, కీడు జరుగుతుందని నమ్ముతారు. ఇదొక్కటే కాదు.. పురుషులు కూడా ఈ సమయంలో మద్యం సేవించరు. వారితో అస్సలు మాట్లాడరు, చూసి నవ్వుకోరు, మాంసం తినడం ఆ ఐదు రోజులు మానేస్తారు.

ఇంతకీ ఈ ఆచారం ఎందుకంటే.?

పూర్వం పిని గ్రామంలోకి ఓ రాక్షసుడు వచ్చి చక్కగా బట్టలు వేసుకున్న పెళ్లైన స్త్రీలను తీసుకెళ్లేవాడట. అందమైన బట్టలు వేసుకున్న ఏ స్త్రీనైనా తీసుకుని వెళ్లి చిత్రహింసలు పెట్టేవాడట. చివరికి లాహు ఘోండ్ దేవత రాక్షసుడిని చంపి స్త్రీలను రక్షించారట. అప్పటినుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ దేవత రాక్షసుడిని వధించిన సందర్భాన్ని ఈ గ్రామప్రజలు పండుగగా జరుపుకుంటారు. అయితే ఈ సంప్రదాయంలో కాలక్రేమణా కొంచెం మార్పు వచ్చి.. ఆ 5 రోజులు మహిళలు సన్నని ఉన్ని బట్టలు ధరించి.. వాటిని మార్చేవారు కాదట.

ఇది చదవండి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ