AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ భంగిమల్లో నిద్ర.. మీ వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పేస్తది.. ఎలాగో తెల్సా

చేతి మీదున్న గీతలు చూసి.. వ్యక్తి జోతిష్యాన్ని, స్వభావాన్ని చెప్పేస్తుంటారు జోతిష్య పండుతులు. ఇదొక్కటే కాదు.. ఓ వ్యక్తితో రెండు నిమిషాలు మాట్లాడితే చాలు.. ఎదుటివారు అతడి వ్యక్తిత్వాన్ని, గుణాన్ని అంచనా వేస్తుంటారు.

ఈ భంగిమల్లో నిద్ర.. మీ వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పేస్తది.. ఎలాగో తెల్సా
Sleeping Positions
Ravi Kiran
|

Updated on: Sep 19, 2024 | 1:18 PM

Share

చేతి మీదున్న గీతలు చూసి.. వ్యక్తి జోతిష్యాన్ని, స్వభావాన్ని చెప్పేస్తుంటారు జోతిష్య పండుతులు. ఇదొక్కటే కాదు.. ఓ వ్యక్తితో రెండు నిమిషాలు మాట్లాడితే చాలు.. ఎదుటివారు అతడి వ్యక్తిత్వాన్ని, గుణాన్ని అంచనా వేస్తుంటారు. అయితే వారు నిద్రపోతున్న భంగిమ బట్టి కూడా వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చునట. నిద్రించే విధానం ఎలా విభిన్నంగా ఉంటే.. అలా వారి వ్యక్తిత్వం డిఫెరెంట్‌గా ఉంటుందట.

బేబీ భంగిమ:

ఈ భంగిమలో పడుకున్న వ్యక్తులు చాలా అమాయకులు. అమాయకంగా, సైలెంట్‌గా ఉండే స్వభావం కారణంగా వీరు బయట ప్రపంచాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేరు. అందుకే చాలా సందర్భాలలో అందరినీ నమ్మి మోసపోతుంటారు.

తలగడను హత్తుకుని పడుకోవడం:

కొందరికి దిండును హత్తుకుని పడుకునే అలవాటు ఉంటుంది. వీరు తమ జీవితంలోని ప్రతీ బంధానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. వీరికి సాయం చేసే గుణం ఉంది. ఇక ఈ సహాయం చేసే గుంతంతో వారికి ఇష్టమైన వ్యక్తుల కోసం జీవితాన్ని సైతం రిస్క్‌లో పెడుతుంటారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అమ్మబాబోయ్.! ఇంటి ప్రహరీ గోడకు పెద్ద కన్నం.. కనిపించింది చూడగా కళ్లు తేలేశాడు

కడుపుపై నిద్రపోవడం:

ఇలా పడుకునే వ్యక్తులు సూటిగా, సరదాగా, ఉల్లాసంగా, ఓపెన్ మైండెడ్‌తో ఉంటారు. ఈ లక్షణాలున్నవారు జీవితంలో ప్రతీ విషయాన్ని సరిగ్గా నిర్వహిస్తారు. జీవితంలో ఎప్పుడూ రిస్క్ తీసుకుంటుంటారు. విమర్శలను తట్టుకోలేక అభద్రతాభావం ఈ వ్యక్తులను ఎప్పుడూ వెంటాడుతుంది.

వెల్లకిలా నిద్ర:

ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. అన్ని పనులను చక్కగా పూర్తి చేస్తారు. వీరికి ఆశ ఎక్కువ.. బంధువుల నుంచి కూడా కావల్సినవి ఆశిస్తారు. కాబట్టి కొన్నిసార్లు ఈ వ్యక్తులు నిరాశకు గురవుతారు.

సైనికుడి భంగిమ:

నిటారుగా సైనికుడి భంగిమలో నిద్రపోయే వ్యక్తులు చాలా దృఢంగా ఉంటారు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడమే కాకుండా ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకునే వ్యక్తిత్వం వీరిది.

స్టార్ ఫిష్‌లా నిద్రపోవడం:

ఈ వ్యక్తులు స్నేహం, బంధాలకు విలువను ఇస్తారు. మంచి స్నేహితుడిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇతరుల మాటలను శాంతియుతంగా వింటారు. చుట్టుపక్కల వారి బాధలను తమ బాధలుగా భావించి సాయం అందిస్తారు.

ఇది చదవండి: 16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం.. టీ20ల్లో అరుదైన రికార్డు

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..