43 సిక్సర్ల సలారోడు.. తోపు అనుకుంటే భారత్ ప్లేయర్ ముందు తలవొంచాడు.. ఎవరంటే.?

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 మ్యాచ్‌లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 16న నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక టీంలో..

43 సిక్సర్ల సలారోడు.. తోపు అనుకుంటే భారత్ ప్లేయర్ ముందు తలవొంచాడు.. ఎవరంటే.?
Nambia Vs Usa
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 18, 2024 | 11:36 AM

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 మ్యాచ్‌లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 16న నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక టీంలో 43 సిక్సర్ల తోపు బ్యాటర్, మరో జట్టులో రెస్టారెంట్ నడుపుతోన్న భారత సంతతి ప్లేయర్ తమ సత్తా చాటుకున్నారు. అదేనండీ.! నమీబియా బ్యాటర్ జేజే స్మిత్, యూఎస్‌ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్.

ఇది చదవండి: పనికిరాడని వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోమన్నారు.. కట్ చేస్తే.. ఈ దమ్మున్నోడు దడ పుట్టించాడు

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 199 పరుగులు చేసింది. నమీబియా తరపున జాన్ ఫ్రైలింక్(70) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఇక నమీబియాలో 43 సిక్సర్లు బాదిన జేజే స్మిత్ ఉన్నప్పటికీ.. అతడు తన జట్టును గెలిపించలేకపోయాడు. ఆరో నెంబర్‌లో బరిలోకి దిగిన జేజే స్మిత్.. 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. దీంతో నమీబియా తరపున 43 సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు 40 సిక్సర్లతో ఎరాస్మస్ పేరిట ఉండేది.

ఇవి కూడా చదవండి

మరోవైపు 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు 51 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యూఎస్ఏ విజయంలో ఆ జట్టు కెప్టెన్ మోనాంక్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. అతడు 82 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 72 పరుగులు చేశాడు. కెరీర్‌లో అతడికిది 12వ అర్ధ సెంచరీ కాగా.. ఈ ఇన్నింగ్స్‌లో మోనాంక్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 31 ఏళ్ల మోనాంక్ పటేల్ భారత సంతతికి చెందిన అమెరికన్ క్రికెటర్. అతడు 2016లో భారత్ నుంచి యూఎస్ఏకి వచ్చి.. శాశ్వత పౌరుడిగా మారాడు. అక్కడే న్యూజెర్సీలో సొంతంగా రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. మోనాంక్ పటేల్ 1993లో భారతదేశంలోని గుజరాత్‌లో జన్మించాడు. అతడు అండర్ -18, అండర్ -19 క్రికెట్ టోర్నీలకు గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఇది చదవండి: మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? ఈ ఫోటోలోని నెంబర్ గుర్తిస్తే మస్త్ మజారే మామ

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..