పనికిరాడని వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోమన్నారు.. కట్ చేస్తే.. ఈ దమ్మున్నోడు దడ పుట్టించాడు..

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన తండ్రి మాదిరిగా క్రికెట్‌లో పేరు తెచ్చుకోవాలని శ్రమిస్తున్నాడు. అయితే డొమెస్టిక్ మాత్రమే కాదు.. ఐపీఎల్‌లోనూ కూడా ఇప్పటిదాకా పెద్దగా రాణించలేకపోయాడు.

పనికిరాడని వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోమన్నారు.. కట్ చేస్తే.. ఈ దమ్మున్నోడు దడ పుట్టించాడు..
Arjun Tendulkar
Follow us

|

Updated on: Sep 17, 2024 | 2:01 PM

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన తండ్రి మాదిరిగా క్రికెట్‌లో పేరు తెచ్చుకోవాలని శ్రమిస్తున్నాడు. అయితే డొమెస్టిక్ మాత్రమే కాదు.. ఐపీఎల్‌లోనూ కూడా ఇప్పటిదాకా పెద్దగా రాణించలేకపోయాడు. అయితేనేం పట్టు వదలని విక్రమార్కుడిలా అర్జున్ టెండూల్కర్ దేశవాళీ టోర్నీల్లో మెరుపులు మెరుస్తూ బీసీసీఐలో దృష్టి పడుతున్నాడు. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న డాక్టర్ కె.తిమ్మప్పయ్య స్మారక టోర్నమెంట్‌లో గోవా తరఫున ఆడుతున్న అర్జున్.. కేఎస్‌సీఏ ఎలెవన్ జట్టుపై 9 వికెట్లు పడగొట్టి తన టీం విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

ఇవి కూడా చదవండి

ఈ రెడ్ బాల్ టోర్నీలో అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో గోవా ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో కేఎస్‌సీఏ ఎలెవన్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి అర్జున్.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. అర్జున్ టెండూల్కర్ పదునైన బౌలింగ్ ముందు KSCA XI బ్యాటర్లు ఒక్కొక్కరిగా తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరారు. అర్జున్ ధాటికి తడబడిన KSCA XI జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గోవా క్రికెట్ టీం తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ జట్టులో అభినవ్ తేజారా 109 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, మంథన్ ఖుత్కర్ 69 పరుగులు చేశాడు.

ఇది చదవండి: బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే

సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అర్జున్ మ్యాజిక్..

అర్జున్ టెండూల్కర్ తన బౌలింగ్ మాయాజాలాన్ని రెండో ఇన్నింగ్స్‌లోనూ కొనసాగించాడు. KSCA XIని కేవలం 121 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అర్జున్ 55 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. దీంతో అర్జున్ ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..
వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!
జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!
దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!
దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..
ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..