- Telugu News Photo Gallery Cricket photos Travis Head's 80 off 25 blows Scotland away, creates history
AUS Vs SCO: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత
ఎడిన్‌బర్గ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక టార్గెట్ చేధించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు ..
Updated on: Sep 05, 2024 | 9:30 AM

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం స్కాట్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ టీ20 మ్యాచ్‌లో స్కాట్లాండ్ నిర్దేశించిన 155 పరుగుల టార్గెట్‌ను 3 వికెట్లు కోల్పోయి 9.4 ఓవర్లలో 62 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా చేధించింది.

ఎడిన్‌బర్గ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక టార్గెట్ చేధించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు జీరోకే తొలి వికెట్‌గా జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌ను కోల్పోయింది.

అయితేనేం ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ మాత్రం ఊచకోత కోశారు. తొలి 6 ఓవర్లు ముగిసేసరికి వీరిద్దరూ ఒక వికెట్ నష్టానికి 113 పరుగులు చేశారు. టీ20ల్లో జట్టు తరపున ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కాగా.. దీంతో ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు సృష్టించింది.

గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉంది. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్ పవర్‌ప్లేలో సఫారీలు 102 పరుగులు చేశారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ కేవలం 25 బంతుల్లో 80 పరుగులు చేశాడు. 320 స్ట్రైక్ రేట్‌తో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో పవర్‌ప్లేలోనే మొత్తం 73 పరుగులు చేశాడు.

దీంతో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా మినిమమ్ 20 బంతుల్లో 300 స్ట్రైక్ రేట్ ఉన్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు ట్రావిస్ హెడ్. 2020లో వెస్టిండీస్‌పై పవర్‌ప్లేలో పాల్ స్టిర్లింగ్ 63 పరుగులు చేశాడు. ఇక ఈ రికార్డును ఇప్పుడు ట్రావిస్ హెడ్ తన ఖాతాలో వేసుకున్నాడు.



















