- Telugu News Photo Gallery Cricket photos Jasprit Bumrah, Sanjana Ganesan celebrate son Angad's first birthday, Photos here
Jasprit Bumrah: ‘మా లిటిల్ సూపర్ హీరోకు అప్పుడే ఏడాది’.. బుమ్రా కుమారుడి ఫొటోస్ చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో
టీమిండియా రేసు గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ ల కుమారుడు ఈ అందమైన ప్రపంచంలోకి అడుగు పెట్టి అప్పుడే ఏడాది గడిచిపోయింది. అంగద్ పుట్టిన రోజును బుమ్రా దంపతులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారాయి.
Updated on: Sep 05, 2024 | 3:45 PM

టీమిండియా రేసు గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ ల కుమారుడు ఈ అందమైన ప్రపంచంలోకి అడుగు పెట్టి అప్పుడే ఏడాది గడిచిపోయింది. అంగద్ పుట్టిన రోజును బుమ్రా దంపతులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారాయి.

'మా సంతోషం.. మా కుమారుడు.. మా చిన్నారి సూపర్ హీరోకు అప్పుడే ఏడాది నిండింది’ అంటూ భార్యాపిల్లలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బుమ్రా.

ఇందులో తమ కుమారుడు అంగద్ తో కలిసి ఎంతో క్యూట్ గా కనిపించారు బుమ్రా, సంజనా గణేషన్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

జస్ప్రీత్ బుమ్రా 15 మార్చి 2021న స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్‌ను వివాహం చేసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత వీరి జీవితంలోకి అంగద్ అడుగు పెట్టాడు.

కాగా తన అద్భుతమైన బౌలింగ్ తో భారత్ కు టీ20 ప్రపంచకప్ అందించిన జస్ ప్రీత్ బుమ్రా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటోన్న బుమ్రా త్వరలో బంగ్లాదేశ్ తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ తో మళ్లీ జట్టుతో కలుస్తాడని సమాచారం.