- Telugu News Photo Gallery Cricket photos Why KL Rahul can’t be traded to RCB yet before IPL 2025 Mega Auction
IPL 2025: బెంగళూరు దరి చేరనున్న కేఎల్ రాహుల్.. బిగ్ షాకిస్తోన్న ఆ రూల్.. అదేంటంటే?
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) సీజన్-18కి సన్నాహకాల మధ్య, కేల్ రాహుల్ తదుపరి అడుగులపై అందరిలో ఉత్సుకత మైదలైంది. ఎందుకంటే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నుంచి కేఎల్ రాహుల్ బయటకు రావడం దాదాపు ఖాయం. దీన్ని మరింత రుజువు చేసేందుకు రాహుల్ కూడా ఆర్‌సీబీ తరపున ఆడతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు.
Updated on: Sep 17, 2024 | 3:03 PM

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) సీజన్-18కి సన్నాహకాల మధ్య, కేల్ రాహుల్ తదుపరి అడుగులపై అందరిలో ఉత్సుకత మైదలైంది. ఎందుకంటే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నుంచి కేఎల్ రాహుల్ బయటకు రావడం దాదాపు ఖాయం. దీన్ని మరింత రుజువు చేసేందుకు రాహుల్ కూడా ఆర్‌సీబీ తరపున ఆడతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు.

కానీ, RCBకి మళ్లీ ఆడాలనే కోరిక ఉన్నప్పటికీ, కేఎల్ రాహుల్ నేరుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎంపిక కాలేడు. అంటే మెగా వేలానికి ముందు లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు నుంచి రాహుల్‌ని ట్రేడ్ చేసే అవకాశం లేదు. బదులుగా మెగా వేలం ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఎందుకంటే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం మెగా వేలంలో ఆటగాళ్ల ట్రేడింగ్‌కు అనుమతి లేదు. బదులుగా, ఆటగాళ్లు ఈ మినీ వేలం సమయంలో మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతించబడతారు. కాబట్టి, ఈ వేలానికి ముందు KL రాహుల్‌ని RCB కొనుగోలు చేయదు.

మెగా వేలంలో కేఎల్ రాహుల్ కనిపిస్తే ఇతర ఫ్రాంచైజీలు కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే రాహుల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు నాయకత్వం వహించిన అనుభవం కూడా అతనికి ఉంది.

తద్వారా కేఎల్ రాహుల్ కొనుగోలుతో కెప్టెన్, వికెట్ కీపర్, ఓపెనర్ స్థానాలను భర్తీ చేసుకోవచ్చు. అందువల్ల, ఒకే ఎంపికతో మూడు స్థానాలను భర్తీ చేయగల ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతాయి.

మెగా వేలం ద్వారా కేఎల్ రాహుల్‌ను ఆర్‌సీబీ కొనుగోలు చేయబోతున్నప్పటికీ, భారీ పోటీ నెలకొనడం ఖాయం. మరి మెగా యాక్షన్‌లో కేఎల్ రాహుల్ ఏ టీమ్‌లో పాల్గొంటారో వేచి చూడాలి.