- Telugu News Photo Gallery Cricket photos Most Powerplay Runs by Travis Head in T20s in 2024 check full details rohit sharma
Powerplay Records: పవర్‌ప్లేలో పవర్ హిట్టర్స్.. రికార్డ్‌ల బెండ్ తీస్తోన్న నలుగురు.. లిస్టులో టీమిండియా ప్లేయర్
Travis Head: 2024లో ఆస్ట్రేలియా, సన్‌రైజర్స్ హైదరాబాద్, వాషింగ్టన్ ఫ్రీడమ్ తరుపున బరిలోకి దిగుతోన్న ట్రావిస్ హెడ్ ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. అది కూడా పవర్‌ప్లేలో అద్భుత బ్యాటింగ్‌తో 1000+ పరుగులు చేయడం విశేషం.
Updated on: Sep 17, 2024 | 4:53 PM

Most Powerplay Runs: టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా పేసర్ ట్రావిస్ హెడ్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. పొట్టి క్రికెట్‌లో పవర్‌ప్లేలో పవర్ ఫుల్ బ్యాటింగ్‌ను ప్రదర్శించడం కూడా ప్రత్యేకం. అంటే, 2024లో టీ20 క్రికెట్‌లో తొలి 6 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు.

ట్రావిస్ హెడ్ 2024లో ఇప్పటివరకు 38 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈసారి పవర్‌ప్లేలోనే 1027 పరుగులు సాధించాడు. ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో పవర్ ప్లేలో 1000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఈ జాబితాలో ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది 44 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడిన సాల్ట్ పవర్‌ప్లేలో మొత్తం 827 పరుగులు చేశాడు.

దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది RCB కెప్టెన్ 38 T20 ఇన్నింగ్స్‌లు ఆడి పవర్‌ప్లేలో మొత్తం 807 పరుగులు చేశాడు.

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. పవర్‌ప్లేలో మొత్తం 2141 పరుగులు చేసి హిట్‌మ్యాన్ ఈ గొప్ప రికార్డు సృష్టించాడు.




