Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే

చేతిలో స్మార్ట్‌ఫోన్, అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్.. ఈ రోజుల్లో యువత చెడు దారులు తొక్కడానికి, చెడు వ్యసనాలకు బానిసలు కావడానికి ఈ రెండూ చాలు. దాని నుంచి వచ్చే మంచి కన్నా.. చెడుకే ఎక్కువగా వినియోగిస్తున్నారు ఈకాలం టీనేజర్లు. ఇక ఈ జనరేషన్‌లో..

Hyderabad: బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే
Oyo Hotel Representative Im
Ravi Kiran
|

Updated on: Sep 10, 2024 | 12:55 PM

Share

చేతిలో స్మార్ట్‌ఫోన్, అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్.. ఈ రోజుల్లో యువత చెడు దారులు తొక్కడానికి, చెడు వ్యసనాలకు బానిసలు కావడానికి ఈ రెండూ చాలు. దాని నుంచి వచ్చే మంచి కన్నా.. చెడుకే ఎక్కువగా వినియోగిస్తున్నారు ఈకాలం టీనేజర్లు. ఇక ఈ జనరేషన్‌లో ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయిన స్నేహం, ప్రేమ అనే ముసుగుతో ఎంతోమంది చిక్కుల్లో పడ్డ సంఘటనలూ మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఓ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ట్రాప్‌లో పడ్డ మైనర్ బాలిక.. 20 రోజుల పాటు ఓయో రూమ్‌లో బంధీగా ఉండటమే కాకుండా.. ఆమెపై అఘాయిత్యానికి కూడా పాల్పడ్డాడు ఆ కిరాతకుడు.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

వివరాల్లోకి వెళ్తే.. భైంసాకు చెందిన ఓ మైనర్ బాలికకు ఇన్‌స్టాలో మహబూబ్ నగర్‌కు చెందిన కృష్ణ చైతన్య అనే యువకుడితో పరిచయమైంది. అది కాస్తా వారి మధ్య ప్రేమకు దారి తీసింది. కొద్దిరోజులు బాగానే ఉన్న వీరి రిలేషన్.. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు రావడంతో కట్ అయ్యింది. అయితేనేం అతడు ఆమె కాలేజీ దగ్గరకు వెళ్లి తనను బాగా చూసుకుంటానని, పెళ్లి చేసుకుంటానని కల్లబొల్లి కబుర్లు చెప్పి.. ఆమెను అతడి ట్రాప్‌లో పడేలా చేశాడు. ఇక అతడి మాయలో పడ్డ ఆ మైనర్ బాలిక.. సరాసరి హైదరాబాద్ వచ్చేసింది. ఆగష్టు 16న బాలికను అతడు నారాయణగూడలోని ఓయో రూమ్‌లో 20 రోజుల పాటు బంధించి.. తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. చివరికి ఎలాగోలా సదరు బాలిక.. ఆమె పేరెంట్స్‌కి ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేసింది. వారు పోలీసులను ఆశ్రయించడంతో షీ టీమ్స్ రక్షించాయి. కాగా, యువకుడిపై క్రిమినల్ కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..