Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట

జోతిష్యబలం, పుట్టిన నక్షత్రం మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుని పిల్లల పేర్లను పెడుతుంటారు. పేరు కేవలం పిలిచేది మాత్రమే కాదు.. అది మన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుందని అంటుంటారు.

S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట
S Letter
Ravi Kiran
|

Updated on: Sep 05, 2024 | 11:58 AM

Share

జోతిష్యబలం, పుట్టిన నక్షత్రం మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుని పిల్లల పేర్లను పెడుతుంటారు. పేరు కేవలం పిలిచేది మాత్రమే కాదు.. అది మన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుందని అంటుంటారు. A నుంచి Z వరకు అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులందరికి వివిధ రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. మరి ఇలాంటి తరుణంలో S అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లున్న వ్యక్తులు ఎలాంటివారో.? వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామా..! వీరు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కువగా ఎవరి సాయం కోరరు. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ తాము మొదలుపెట్టిన ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.

లవ్ లైఫ్:

పేరు S అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు తమ భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు. వారు తమ భాగస్వామి నుంచి కూడా ఆశించేది అదే. దీంతో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. అలాగే, Sతో మొదలయ్యే వ్యక్తులు చాలా అందంగా, శృంగారభరితంగా ఉంటారు. వీరు రొమాన్స్‌లో రారాజులు.

వృత్తి:

Sతో మొదలయ్యే వ్యక్తులు కొన్ని విషయాలలో చాలా అదృష్టవంతులు. కెరీర్, ఆదాయంలో బాగా రాణిస్తారు. వీరు ఏ రంగం ఎంచుకున్నా.. అందులో విజయం సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. Sతో మొదలయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు సాధారణంగా 35 నుంచి 40 సంవత్సరాల వయస్సుకు చేరుకునేసరికి ఆర్థికంగా స్థిరపడతారు. అదే సమయంలో వీరు కొంచెం లగ్జరీగా జీవించాలనుకుంటున్నారు.

నాయకత్వ లక్షణాలు:

పేరు S అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల్లో లీడర్‌షిప్ క్వాలిటిస్ ఎక్కువ. ఎవరి కిందా పని చేయకూడదనుకుంటారు. ఏది చేసినా అది తమ ఇష్టానుసారంగా జరగాలని భావిస్తారు. అదేవిధంగా, ఇతరులు కూడా వారి కోరిక మేరకు పని కొనసాగించాలనుకుంటున్నారు. ఎవరు ఏం చెప్పినా చాలా ఆలోచించి వ్యవహరిస్తారు. ఈ లక్షణంతో వీరి పట్ల ఇతరులు ఎక్కువగా ఆకర్షితులవుతారు.