Viral Video: ఆహా.. ఏం దర్జా గురూ..! కాలు మీద కాలేసుకుని.. కదులుతున్న ట్రక్కుపై ఊగుతూ..!!

ఓ పాత మంచాన్ని తీసుకుని ట్రక్కులో నాలుగు వైపుల తాళ్లతో కట్టిన ఊయలలో అతడు హాయిగా ఊగుతూ వెళ్తున్న ఈ దృశ్యాన్ని వెనకాల వస్తున్న వాహనదారులు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేయటంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ రియాక్షన్స్‌ ఇస్తున్నారు.

Viral Video: ఆహా.. ఏం దర్జా గురూ..! కాలు మీద కాలేసుకుని.. కదులుతున్న ట్రక్కుపై ఊగుతూ..!!
man lounges on hammock-cot on moving truck
Follow us

|

Updated on: Sep 05, 2024 | 12:24 PM

పాకిస్తానీ వ్యక్తి కదులుతున్న ట్రక్కులో ఊయల మరియు మంచంతో ఆనందిస్తున్నాడు, ప్రజలు చెప్పారు – ఇదే నిజమైన శాంతి గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ నుండి పలు రకాల ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడి ప్రజలు తమ జీవితాలను నిలబెట్టుకోవడం కోసం ఎలాంటి ప్రత్యేకమైన మార్గాలను ఎంచుకుంటున్నారో ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నాయి. ఇంటర్‌నెట్‌లో ఆ వీడియోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా, అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి చేసిన జుగాఢ్‌ అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. కదిలే వాహనంలో ఊయల కట్టుకుని పడుకోవాలనే అతని ఆలోచనను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో పాకిస్తాన్‌కు చెందినదిగా తెలిసింది. అయితే, వీడియోలో రోడ్డుపై ఓ భారీ ట్రక్కు వెళ్తోంది. ట్రక్కులో ఓ వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా ప్రత్యేక ఊయల ఏర్పాటు చేసుకున్నాడు.. ఆ ఊయలలో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ.. చేతిలో మొబైల్‌ఫోన్‌తో ఎంజాయ్‌ చేస్తున్నాడు.  ఓ పాత మంచాన్ని తీసుకుని ట్రక్కులో నాలుగు వైపుల తాళ్లతో కట్టిన ఊయలలో అతడు హాయిగా ఊగుతూ వెళ్తున్న ఈ దృశ్యాన్ని వెనకాల వస్తున్న వాహనదారులు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేయటంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ రియాక్షన్స్‌ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఈ వీడియో @theoverseaspakistani Insta పేజీ నుండి షేర్‌ చేయగా, అది కాస్త నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. జీవితంలోని ప్రతి సందర్భంలోనూ సంతోషంగా ఉండాలంటారు..అందుకే ఈ వ్యక్తి తను పనిలోనే సంతోషంగా గడుపుతున్నాడు. ఉన్నచోట ఉయ్యాల ఊగుతూ తనే మహరాజుననే భావనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ పోస్ట్ వెలువడిన వెంటనే సోషల్ మీడియా వినియోగదారులు పెద్ద సంఖ్యలో స్పందించారు. మరోవైపు, పాకిస్థాన్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల, మాల్‌లో దోపిడీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..