Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Patients: బ్లడ్‌ షుగర్‌ ఉన్నవారికి కాకరకాయ జ్యూస్ ఓ వరం.. దీన్ని తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

ప్రస్తుత కాలంలో చాలా మంది మధుమేహంతో ఇబ్బందిపడుతున్నారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. డయాబెటిస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో ఎక్కువ మొత్తంలో హెచ్చుతగ్గులు ఉంటే ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఊబకాయం, డయాబెటిస్ మూత్రపిండాల వైఫల్యం, ప్రాణాంతక గుండె జబ్బులు వంటి ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ, డయాబెటీస్‌ ఉన్నవారు క్రమం తప్పకుండా కాకరకాయ జ్యూస్‌ను తాగడం వల్ల బ్లడ్‌ షుగర్‌ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీరికి ఇది ఒక వరంలా పనిచేస్తుందని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Sep 05, 2024 | 8:07 AM

Share
కాకరకాయ జ్యూస్ ను తాగడం వల్ల మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయ జ్యూస్ జీవక్రియను పెంచుతుంది. గ్లూకోజ్ శోషణను నియంత్రించడానికి  సహాయపడుతుంది. అందుకే కాకరకాయ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

1 / 5
కాకరకాయ జ్యూస్ చేదుగా ఉంటుంది. కానీ ఇది మన ఆరోగ్యానికి ఓ వరంలా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కాకరకాయలో పాలీపెప్టైడ్-పి లేదా పి-ఇన్సులిన్ అని చెప్పే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

2 / 5
కాకరకాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్, ఇతర పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. డయాబెటిక్ రోగులు చాలా సార్లు ఆక్సీకరణ ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. కానీ ఈ ఆక్సీకరణ ఒత్తిడి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

3 / 5
ఇది శరీరంలోని వివిధ అవయవాలను కూడా దెబ్బతీస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం వల్ల కాకరకాయ రసం డయాబెటిక్ రోగులలో నెఫ్రోపతి, న్యూరోపతి, రెటినోపతి వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. కాకరకాయ జ్యూస్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

4 / 5
కాకరకాయ జ్యూస్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ పేషెంట్లకు చాలా మంచిదని చెప్తారు. డయాబెటీస్ పేషెంట్లు బరువు పెరగకుండా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.

5 / 5