Castor Oil Beauty Benefits: ఆముదం అందానికి దివ్యౌషధం..! రోజూ ఇలా రాస్తే మ్యాజిక్‌లాంటి మార్పు..

ఆముదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తరచూ చెబుతుంటారు. అంతేకాదు.. ఇది ఆడవారికి మంచి సౌందర్య సంరక్షణకు కూడా తోడ్పడుతుందని చెబుతున్నారు. వయసు పెరుగుతున్నా అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అలాంటివారు రెగ్యులర్ గా ముఖానికి ఆముదం రాసుకోవటం వల్ల చక్కటి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. చర్మ సంరక్షణ, అందంగా మెరిసిపోవడానికి.. బ్యూటీ కేర్‌లో ఆముదాన్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Sep 05, 2024 | 7:29 AM

ఆముదం చర్మానికి మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్  ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ అందాన్ని పెంచడంలో సహకరిస్తాయి. రోజూ ముఖానికి ఆముదం రాయడం వల్ల నల్ల మచ్చలు, స్పాట్స్ , మొటిమల తాలుకా మచ్చలు అన్నీ తగ్గిపోతాయి.

1 / 6
ఆముదంలోని ఇందులో రిసినోలిస్ యాసిడ్ సంవృద్ధిగా ఉంటుంది, ఇది యాంటీఇన్ఫ్లమేటరి, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు సౌందర్య పోషణకు సహాయపడతాయి. ముఖానికి రెగ్యులర్ గా ఆముదంతో మసాజ్ చేయడం వల్ల ముఖం లో గ్లో పెరగడమే కాదు.. స్కిన్ టైట్ గా కూడా మారుతుంది.

2 / 6
వయసు రీత్యా మనకు ముఖంపై ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ముడతలను మాయం చేసి.. అందంగా కనిపించేలా చేయడంలో ఈ ఆముదం పని చేస్తుంది. చాలా మంది డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటివారు ఆముదం రాస్తే.. చర్మం మృదువుగా, హైడ్రేటెడ్ గా మారుతుంది.

3 / 6
ఉదయం నిద్రలేచిన వెంటనే, లేదంటే రాత్రి పడుకునే ముందు ఒక చుక్క ఆముదాన్ని పెదవులకు రాసుకుంటే కొద్ది రోజుల్లోనే లేలేత, కోమలమైన పెదవులు మన సొంతమవుతాయి. ఆముదం సహజసిద్ధమైన లిప్‌బామ్‌గా ఉపయోగపడుతుంది. ఎండలో బయటకు వెళ్లినా, వెళ్లకపోయినా ట్యాన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ట్యాన్ ని తొలగించడంలో ఆముదం బాగా పని చేస్తుంది.

4 / 6
కొందరిలో మోచేయి, మెడ భాగంలో నల్లగా మారుతుంది. ఇలాంటి వాళ్లు ఆముదంలో కాస్త ఆలివ్ నూనె, నిమ్మరసం కలిపి రోజూ ఆయా భాగాలలో స్మూత్‌గా మర్దనా చేయాలి. ఇలా చేస్తే నెల రోజులలోనే మంచి ఫలితం చూస్తారు. పాదాల పగుళ్ల సమస్యకు కూడా ఆముదంతో చెక్ పెట్టచ్చు. ఆముదంలో కాస్త పసుపు కలిపి పగుళ్ల మీద రాయాలి. కొన్నిరోజులకు పగుళ్లు మాయమవుతాయి.

5 / 6
ఆముదం సహజ క్లెన్సర్‌లా ఉపయోగపడుతుంది. ఆముదాన్ని ముఖానికి పట్టించి పదినిమిషాల పాటూ ఆవిరిపడితే చర్మకణాలు శుభ్రపడతాయి. ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోతుంది. చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.

6 / 6
Follow us