Watch: ఫోటో దిగకుండా డిస్టర్బ్‌ చేసిందని.. పెద్దపులికే చుక్కలు చూపించిన బుడ్డొడు.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే..

అచ్చంగా ఆ బాలుడు చేస్తున్న పనిని పులి కూడా రిపీట్‌ చేస్తోంది. 'ఫైట్ ఆఫ్ హ్యాండ్స్' అనే క్యాప్షన్‌తో ఫిగెన్ అనే ప్రముఖ ఖాతా ద్వారా ఈ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 26 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియోపై పలువురు తమ అభిప్రాయాలను కూడా తెలియజేశారు.

Watch: ఫోటో దిగకుండా డిస్టర్బ్‌ చేసిందని.. పెద్దపులికే చుక్కలు చూపించిన బుడ్డొడు.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే..
baby and tiger playing paw punch
Follow us

|

Updated on: Sep 05, 2024 | 10:46 AM

జంతుప్రదర్శనశాల జూకు సంబంధించి అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా రెండు రకాల వీడియోలు తరచుగా ఎక్కడో ఒక జరుగుతూనే ఉంటాయి. జూలో జంతువుల ఆవరణలోకి ప్రమాదవశాత్తు పడిపోవటం, కొందరు తాగుబోతులు పీకల దాకా తాగేసి సింహం, పులి వంటి వాటికి దగ్గరగా వెళ్తుంటారు. అలాగే, జీవితాంతం బందిఖానాలో జీవించే జంతువుల అరుదైన సంతోషకరమైన క్షణాలు కూడా అప్పుడప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ప్రజల హృదయాలను గెలుచుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

తూర్పు చైనాలోని హుజౌలోని జంతుప్రదర్శనశాలను సందర్శించిన ఒక చిన్నారి, గాజు ఎన్‌క్లోజర్‌లో బంధించిన పులిని చూసిన వెంటనే ఏం చేశాడో ఈ వైరల్‌ వీడియో చూపుతుంది. ఒక పెద్ద పులిని బంధించిన ఆవరణలో ఓ బుడ్డొడు జాలిగా నడుస్తూ వెళ్తున్నాడు. పులి ఉన్న బోను గ్లా్స్‌కు కాస్త ఒరిగి ఎందుకో నవ్వుతున్నాడు.. ఎదురుగా ఎవరైనా వాడిని ఫోటో తీస్తున్నారేమో బహుషా.. ఆ క్షణం వాడు అలాంటి లుక్కే ఇచ్చాడు. సరదాగా నడుచుకుంటూ వెళ్తున్న అతడు.. పులి వద్దకు రాగానే ఫోటోకి పోజులివ్వడానికి గ్లాసు దగ్గరగా నిలబడ్డాడు. కానీ, అంతలోనే ఆ పులి బాలుడిని వాసన చూసి పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ గాజు గోడ వారికి అడ్డుగా ఉంది.

ఇవి కూడా చదవండి

పులి తన ముఖం తిప్పగానే వాడికి కోపం వచ్చిందనుకుంటా.. ఆ వెంటనే పిల్లవాడు తన రెండు చేతులతో ఆ గ్లాస్‌ను కొడుతూ ఉన్నాడు. వాడికి ఆ పులిని కొట్టాలని ఉందనుకుంటా.. రెండు చేతులతో గ్లాస్‌పై పదే పదే కొడుతూనే ఉన్నాడు.. అలా కొంత సమయం తరువాత, పులి కూడా తన ముందు రెండు కాళ్లతో గ్లాస్‌ను కొడుతోంది. అచ్చంగా ఆ బాలుడు చేస్తున్న పనిని పులి కూడా రిపీట్‌ చేస్తోంది. ‘ఫైట్ ఆఫ్ హ్యాండ్స్’ అనే క్యాప్షన్‌తో ఫిగెన్ అనే ప్రముఖ ఖాతా ద్వారా ఈ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 26 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియోపై పలువురు తమ అభిప్రాయాలను కూడా తెలియజేశారు.

ఈ వీడియో చూడండి..

పులి ఆ పిల్లవాడితో ఆడుకుంటోందని ఒకరు కామెంట్‌ చేయగా, నిజంగా లవ్లీ స్లీట్ ఆఫ్ హ్యాండ్ అంటూ మరొకరు రాశారు. ఓహ్, చాలా అందంగా ఉంది. పులి రియాక్షన్ చూడాల్సిందే అంటూ మరొకరు రాశారు. మొత్తనికి వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..