ఈ ముగ్గురు SRH ప్లేయర్లు మెగా వేలంలోకి వస్తే ఇక దబిడి దిబిడే..! వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే
ఐపీఎల్ 2024 సీజన్ రన్నరప్‌గా నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఎస్‌ఆర్‌హెచ్ టీం ఈ ఏడాది దూకుడైన ఆటతీరు కనబరిచారు. అయితే ఫైనల్‌లో కేకేఆర్ చేతిలో..
ఐపీఎల్ 2024 సీజన్ రన్నరప్‌గా నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఎస్‌ఆర్‌హెచ్ టీం ఈ ఏడాది దూకుడైన ఆటతీరు కనబరిచారు. అయితే ఫైనల్‌లో కేకేఆర్ చేతిలో ఘోరంగా ఓడిపోయి.. ట్రోఫీ చేజార్చుకున్నారు. ఇక డిసెంబర్ 2024లో జరగబోయే మెగా వేలానికి చాలామంది స్టార్ ప్లేయర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫ్రాంచైజీకొచ్చి కేవలం నాలుగు రిటెన్షన్‌లు మాత్రమే ఛాన్స్ ఉండటంతో.. ప్రతీ జట్టులోని దాదాపుగా స్టార్ ప్లేయర్స్ మెగా వేలంలోకి అడుగుపెట్టనున్నారు. ఇక కావ్య పాప ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకుని.. ఈ ముగ్గురిని విడిచిపెడితే.. ఇక వారు వేలంలోకి వస్తే భారీ ధర పలికే అవకాశాలు ఉన్నాయి. మరి వారెవరంటే.?
ఇది చదవండి: పనికిరాడని వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోమన్నారు.. కట్ చేస్తే.. ఈ దమ్మున్నోడు దడ పుట్టించాడు
ఐడెన్ మార్క్‌రమ్:
గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మార్క్‌రమ్.. ఐపీఎల్ 2024లో పూర్తిగా విఫలమయ్యాడు. మిడిలార్డర్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇక SRH ఈ రైట్ హ్యాండ్ ప్లేయర్‌ను విడిచిపెడితే.. మిగిలిన ఫ్రాంచైజీలు మార్క్‌రమ్ కోసం పోటీపడటం ఖాయం.
గ్లెన్ ఫిలిప్స్:
ఈ సీజన్‌లో గ్లెన్ ఫిలిప్స్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. క్లాసెన్ రూపంలో వికెట్ కీపర్ జట్టులో ఉండటంతో.. ఫిలిప్స్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే ఫిలిప్స్ వేలంలోకి వస్తే మాత్రం.. భారీ ధర పలకడం ఖాయం. ఈ ఆల్‌రౌండర్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి.
నితీశ్ రెడ్డి:
ఐపీఎల్ 2024లో ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డి వేలంలోకి వస్తే మాత్రం.. జాక్‌పాట్ కొట్టినట్టే.! అటు బ్యాట్, ఇటు బంతితో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించిన ఈ ప్లేయర్ మెగా వేలంలో భారీ ధర పలకడం ఖాయం.
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌తో పాటు హెన్రిచ్ క్లాసెన్‌లను రిటైన్ చేసుకునే ఛాన్స్‌లు ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక అన్‌క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో నితీష్ కుమార్ రెడ్డి లేదా షాబాజ్ అహ్మద్‌లలో ఒకరిని రిటైన్ చేసుకోవచ్చు.
ఇది చదవండి: మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? ఈ ఫోటోలోని నెంబర్ గుర్తిస్తే మస్త్ మజారే మామ
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..