AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అందరూ దేవుడ్ని మొక్కేందుకు వెళ్తే.. వీరు మాత్రం గుడి యెనక చేసే పనులివి

గుప్తనిధుల వేటగాళ్లు బరితెగించారు. ఏకంగా ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పక్కనే ఉన్న ఉపగుళ్లపై పంజా విసిరారు. గుప్తనిధుల కోసం గర్భగుడి..

Telangana: అందరూ దేవుడ్ని మొక్కేందుకు వెళ్తే.. వీరు మాత్రం గుడి యెనక చేసే పనులివి
Representative Image
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Sep 23, 2024 | 7:28 PM

Share

గుప్తనిధుల వేటగాళ్లు బరితెగించారు. ఏకంగా ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పక్కనే ఉన్న ఉపగుళ్లపై పంజా విసిరారు. గుప్తనిధుల కోసం గర్భగుడి పైకప్పు తొలగించి నిచ్చెన సహాయంతో లోపలికి ప్రవేశించిన కేటుగాళ్లు గర్భగుడిలో తవ్వకాలు జరిపారు. పురావస్తు శాఖ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ తవ్వకాలు రామప్ప దేవాలయం పక్కనే ఉన్న గొల్లగుడిలో జరిగాయి. గర్భగుడి పైకప్పు తొలగించిన గుర్తు తెలియని దుండగులు నిచ్చెన సహాయంతో గర్భగుడిలోకి దిగిన ఆనవాళ్లు కనిపించాయి.

సహజంగా పురాతన దేవాలయాల్లో గర్భగుడిలో దేవుడు విగ్రహాల కింద నిధి ఉంటుందని ఒక ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పురాతన దేవాలయంలోకి దిగిన పైకప్పు నుండి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు శిల్పాలను కూడా ధ్వంసం చేశారు. మరోవైపు గర్భగుడిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగిన విషయాన్ని స్థానికులు, పురావస్తుశాఖ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. పురావస్తు శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రామప్ప పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఉప దేవాలయాలు తొమ్మిది ఉంటాయి. వాటి పట్ల పర్యవేక్షణ లేకపోవడంతో ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ ఉపగుళ్లు గుప్తనిధుల వేటగాళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. గతంలో క్షుద్రపూజలు నిర్వహించి మరి తవ్వకాలు జరిపిన చరిత్ర కూడా ఉంది.

ఇది చదవండి: వామ్మో! మూల మలుపు చెట్టుకు చీర కట్టిన దృశ్యం.. వెళ్లి చూడగా గుండె గుభేల్

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది