Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కరోజులో సైబర్ నేరగాళ్లు ఎంత దోచేస్తున్నారంటే..

సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని సైబర్ నేరస్థుల ట్రాప్ కి గురవుతున్న బాధితులు క్షణాల్లో కష్టార్జితం మొత్తాన్ని పోగొట్టుకుంటున్నారు. అత్యధికంగా చదువుకున్నవారే సైబర్ నేరస్తుల బారిన పడి బాధితులుగా మారుతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించవచ్చని దురాశతో విద్యావంతులు సైతం సైబర్ నేరస్తుల ట్రాప్‌కు చిక్కుతున్నారు..

Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కరోజులో సైబర్ నేరగాళ్లు ఎంత దోచేస్తున్నారంటే..
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Sep 23, 2024 | 7:45 PM

సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని సైబర్ నేరస్థుల ట్రాప్ కి గురవుతున్న బాధితులు క్షణాల్లో కష్టార్జితం మొత్తాన్ని పోగొట్టుకుంటున్నారు. అత్యధికంగా చదువుకున్నవారే సైబర్ నేరస్తుల బారిన పడి బాధితులుగా మారుతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించవచ్చని దురాశతో విద్యావంతులు సైతం సైబర్ నేరస్తుల ట్రాప్‌కు చిక్కుతున్నారు. ప్రతి ఏడాది సైబర్ క్రైమ్ కేసులు సుమారు 30 శాతానికి పైగా పెరుగుతూనే ఉన్నాయి. టెక్నాలజీ పరంగా అవగాహన పెరుగుతున్నప్పటికీ నేరస్తులు సైతం తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. ఒక చదువుకోలేని మూర్ఖుడు, ఎంతో విద్యావంతుడైన చదువుకున్న వాడిని మోసం చేస్తున్నాడు. 8 నెలల వ్యవధిలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సుమారు రెండువేలపైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ సంఖ్యలో బాధితులు ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో మోసపోయారు. ఒక హైదరాబాద్ నుండే దాదాపు 205 కోట్ల రూపాయలను బాధితులు మోసపోయారు.

ప్రతిరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు 10 నుండి 15కుపైగా ఫిర్యాదులు వస్తున్నాయి. అత్యధికంగా పెట్టుబడి పేరుతో వచ్చే మోసాలతో పాటు కొరియర్ ఫ్రాడ్‌లే అధికంగా ఉంటున్నాయి. ప్రతి నెల సగటున 30 కోట్ల రూపాయలకు పైగా నగదును సైబర్ నేరస్తులు బాధితుల నుండి దోచేస్తున్నారు. గతంతో పోలిస్తే సైబర్ క్రైమ్ కేసులు అంతకింతకు పెరుగుతున్నాయి. 2022లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2457 కేసులు నమోదు కాగా బాధితులు నష్టపోయిన డబ్బు 82 కోట్లకు పైగా ఉండేది. 2023లో 2735 కేసులు నమోదు అవ్వగా వాటిలో 133 కోట్ల రూపాయలు బాధితులు మోసపోయారు. ఇక తాజాగా 2024లో ఇప్పటివరకు 2105 కేసులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదు అవ్వగా 205.70 కోట్ల రూపాయలు బాధితుల నుండి నిందితులు కాజేశారు.

ఇలాంటి వారినైనా ట్రాప్ లో పడేయటం సైబర్ నేరస్తులకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి నేరస్తుల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలి అని పోలీసులు సూచిస్తున్నారు. ఈజీ మనీకి ఆశపడి కష్టపడి సంపాదించిందంతా పోగొట్టుకోవద్దని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి