చీ..చీ బైక్‌పై ఇదే పనిరా బాబు.. జనాలు చూస్తున్నారన్న సోయి కూడా లేదు..అరెస్టు చేసిన పోలీసులు

ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కనిపించిన బైక్‌ రొమాన్స్‌ ఇప్పుడు హైదరాబాద్‌కూ పాకింది. నగర శివారు శ్రీశైలం రహదారిపై ప్రేమజంటలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే బైక్‌పై రొమాన్స్‌ చేస్తూ ఓ జంట చెలరేగిపోయింది. బైక్‌ పెట్రోల్‌ టాంక్‌పై ఓ యువతి కూర్చొని వాహనం నడుపుతున్న వ్యక్తికి..

చీ..చీ బైక్‌పై ఇదే పనిరా బాబు.. జనాలు చూస్తున్నారన్న సోయి కూడా లేదు..అరెస్టు చేసిన పోలీసులు
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Subhash Goud

Updated on: Sep 27, 2024 | 12:02 PM

ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కనిపించిన బైక్‌ రొమాన్స్‌ ఇప్పుడు హైదరాబాద్‌కూ పాకింది. నగర శివారు శ్రీశైలం రహదారిపై ప్రేమజంటలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే బైక్‌పై రొమాన్స్‌ చేస్తూ ఓ జంట చెలరేగిపోయింది. బైక్‌ పెట్రోల్‌ టాంక్‌పై ఓ యువతి కూర్చొని వాహనం నడుపుతున్న వ్యక్తికి ముద్దులు పెడుతూ రొమాన్స్‌ చేసింది. బహిరంగ ప్రదేశమని, చుట్టూ జనాలు చూస్తున్నారన్న సోయి కూడా లేకుండా హద్దులు మీరారు. బైక్‌ వెనుకే వస్తున్న మరో జంట ఈ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు ట్విట్టర్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. టీవీలో ప్రసారమైన కథనాలకు పోలీసులు స్పందించారు.

ఎట్టకేలకు బైక్‌పై యువతితో రొమాన్స్‌ చేసిన యువకుడిని అరెస్ట్‌ చేశారు. ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. బైక్‌ నడిపిన యువకుడిపై బాలాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదకర డ్రైవింగ్‌, అసభ్య ప్రవర్తన కింద కేసునమోదు చేసిన పోలీసులు యువకుడికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మరోసారి ఇలాంటి వికృత చేష్టలు చేయొద్దంటూ హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి