భర్తలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అసదుద్దీన్ ఓవైసీ.. ఎందుకో తెలిస్తే

హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతంలో గృహహింస ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తమ భర్తలు వేధిస్తున్నారంటూ పలువురు మహిళలు పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కుతున్నారు. మరికొందరు అయితే ఏకంగా అసదుద్దీన్‌ ఓవైసీతో తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

భర్తలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అసదుద్దీన్ ఓవైసీ.. ఎందుకో తెలిస్తే
Asaduddin Owaisi
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Ravi Kiran

Updated on: Sep 23, 2024 | 9:09 PM

హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతంలో గృహహింస ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తమ భర్తలు వేధిస్తున్నారంటూ పలువురు మహిళలు పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కుతున్నారు. మరికొందరు అయితే ఏకంగా అసదుద్దీన్‌ ఓవైసీతో తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ అసదుద్దీన్‌ ఓవైసీకి ఫోన్‌ చేసి రక్షణ కోరింది. తన భర్త బిర్యానీ హోటల్‌ను ఓవైసీ చేతుల మీదుగానే ప్రారంభించారు కాబట్టి.. భర్తకు నచ్చ జెప్పాల్సిన బాధ్యత కూడా మీదే అంటూ ఓవైసీని కోరింది. పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది.

ఎలాగైనా భర్తను సన్మార్గంలో పెట్టాలంటూ ఓవైసీని వేడుకుంది. దీంతో స్పందించిన అసదుద్దీన్‌ ఓవైసీ బహిరంగ సభలో బిర్యానీ హోటల్ యజమానిని ఉద్దేశించి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే చాలామంది పాతబస్తీకి చెందిన మహిళలు ఎంఐఎం నేతలను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. భర్తలు నిరంతరం వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

మరోవైపు కొందరు భర్తలు కూడా ఎంఐఎం నేతలకు భార్యలు వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఆదివారం రాత్రి తన చెల్లెలిని బావ వేధిస్తున్నాడంటూ ఆగ్రహానికి గురైన బామవరిది.. బావను కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన గోల్కొండ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇలాంటి ఎన్నో ఘటనలు పాతబస్తీ ఏరియాలో జరుగుతుండటంపై ఎంఐఎం నేతలు బాధిత మహిళలతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తున్నారు.

ఇది చదవండి: తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్‌.. ఏఆర్‌ డెయిరీకి నోటీసులు

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి