Hyderabad: హైదారాబాద్ లో భారీ చోరీ.! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు..
హైదరాబాద్ శివారులోని ఐటీ కారిడార్ లో భారీ చోరీ జరిగింది. భూమి అమ్మగా వచ్చిన రూ.2 కోట్ల నగదు ఇంట్లో దాయగా.. దొంగలు పడి నోట్ల కట్టలను ఎత్తుకెళ్లారు. నోట్ల కట్టలతో పాటు బీరువాలో దాచుకున్న 28 తులాల బంగారు ఆభరణాలను కూడా మాయం చేశారు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీ కారిడార్ లోని మక్త గ్రామంలో నాగభూషణం నివాసం ఉంటున్నాడు. ఇటీవల శంకర్ పల్లిలో తనకున్న 10 ఎకరాల భూమిని నాగభూషణం అమ్మకానికి పెట్టాడు.
హైదరాబాద్ శివారులోని ఐటీ కారిడార్ లో భారీ చోరీ జరిగింది. భూమి అమ్మగా వచ్చిన రూ.2 కోట్ల నగదు ఇంట్లో దాయగా.. దొంగలు పడి నోట్ల కట్టలను ఎత్తుకెళ్లారు. నోట్ల కట్టలతో పాటు బీరువాలో దాచుకున్న 28 తులాల బంగారు ఆభరణాలను కూడా మాయం చేశారు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీ కారిడార్ లోని మక్త గ్రామంలో నాగభూషణం నివాసం ఉంటున్నాడు. ఇటీవల శంకర్ పల్లిలో తనకున్న 10 ఎకరాల భూమిని నాగభూషణం అమ్మకానికి పెట్టాడు. మంచి ధర రావడంతో అమ్మకానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇందులో భాగంగా రూ. 2 కోట్ల 2 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నాడు. ఈ సొమ్మును నాగభూషణం ఇంట్లోనే దాచాడు. ఈ విషయం ఆ దొంగలు ఎలా తెలుసుకున్నారో ఏమో.. శనివారం రాత్రి ఆ సొమ్మంతా ఎత్తుకెళ్లారు. ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగలగొట్టి డబ్బు, నగలు పట్టుకెళ్లారని బాధితుడు నాగభూషణం కన్నీటిపర్యంతమయ్యాడు. నాగభూషణం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగతనం జరిగిన తీరును పరిశీలించి, పరారైన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానంతో నాగభూషణం డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.