Dogs: అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
ఇటీవల శునకాల ఆగడాలు మితిమీరి పోయాయి. రోడ్లపై స్వైర విహారం చేస్తూ దారిన వెళ్లేవారిపై దాడులకు పాల్పడిన ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ చూస్తూనే ఉన్నాం. చిన్నారులు, వృద్ధులు ఎందరో ఈ కుక్కల దాడిలో గాయపడ్డారు.. కొందరు ప్రాణాలే కోల్పోయారు. అయితే ఈ కుక్కలు రోడ్లమీదే కాదు ఇళ్లలోకి, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రుల్లోకి కూడా చొరబడుతున్నాయి. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన.

నాగర్‌కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అచ్చం విధుల్లో తిరుగుతున్నట్లుగా కుక్కల గుంపు ఆస్పత్రి అంతా కలియదిరుగుతున్నాయి. అక్కడ డాక్టర్ల విధులను చెక్ చేయడానికి వచ్చాయా అన్నట్టుగా ఆస్పత్రిలో కుక్కలు తిరుగుతుంటే పట్టించుకునేనాధుడు లేడు. ఇక ఈ కుక్కల గుంపును చూసి ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన వారు ఎక్కడ అవి తమను కాటేస్తాయోనని హడలిపోతున్నారు. ఇలా ఆసుపత్రిలో శునకాలు విహరిస్తున్న వీడియో నెట్టింట వైరల్ కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. కుక్కలను వెంటనే పట్టుకోవాలని పేషెంట్లు కోరుతున్నారు. కాగా.. ఈ ఘటనపై అధికారులు సైతం ఆరా తీసినట్టు చెబుతున్నారు. భద్రత గురించి వివరణ అడిగినట్లు తెలుస్తోంది.. కాగా.. ప్రస్తుతం కుక్కలు ఆసుపత్రిలో సంచరిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస