Tollywood: దేవరలో సైఫ్ వైఫ్‌గా నటించింది ఎవరో తెల్సా.. బుల్లితెరపై తెగ ఫేమస్.. తిరుగులేదంతే

ఎన్టీఆర్ డ్యుయల్ రోల్‌లో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం 'దేవర'. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, శృతి మరాఠీ హీరోయిన్లుగా.. సైఫ్ ఆలీఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం.. ప్రీమియర్ షో నుంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే..

Tollywood: దేవరలో సైఫ్ వైఫ్‌గా నటించింది ఎవరో తెల్సా.. బుల్లితెరపై తెగ ఫేమస్.. తిరుగులేదంతే
Devara Movie Saif
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 27, 2024 | 6:37 PM

ఎన్టీఆర్ డ్యుయల్ రోల్‌లో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, శృతి మరాఠీ హీరోయిన్లుగా.. సైఫ్ ఆలీఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం.. ప్రీమియర్ షో నుంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో సైఫ్ ఆలీఖాన్ వైఫ్‌గా నటించింది ఎవరో తెల్సా.? ఆమె మరెవరో కాదు కన్నడ, తెలుగు భాషల్లోని బుల్లితెరపై తెగ ఫేమస్ అయింది ఈ అందాల భామ. ఈ మూవీతో అమ్మడి క్రేజ్ పెరిగితే.. స్మాల్ స్క్రీన్‌కి స్వస్తి చెప్పి.. సిల్వర్ స్క్రీన్‌పై ఫిక్స్ అయిపోవడం ఖాయం. మరి ఆమె ఎవరని అనుకుంటున్నారా.?

ఆమె మరెవరో కాదు.. చైత్ర రాయ్. ‘అష్టా చమ్మా’ సీరియల్‌తో తెలుగు బుల్లితెరకి పరిచయమైంది చైత్ర రాయ్. ప్రస్తుతం ‘రాధకు నీవేరా ప్రాణం’ అనే సీరియల్‌లో నటిస్తోంది. కన్నడ సీరియళ్లతో కెరీర్ ప్రారంభించిన చైత్రకు.. తెలుగు సీరియల్స్ మంచి ఫాలోయింగ్ సంపాదించి పెట్టాయి. ‘అష్టాచమ్మా’ తర్వాత ‘దటీజ్ మహాలక్ష్మీ’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ లాంటి సీరియల్స్‌లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే చైత్ర.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ చైత్ర లుక్‌లో ఎలాంటి మార్పురాలేదు.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్, సైఫ్ లాంటి స్టార్లను స్క్రీన్‌పై చూడటమే తప్ప.. నేరుగా కలిసిందే లేదని.. అలాంటిది వాళ్లతో కలిసి నటించే అవకాశం వచ్చిందంటే ఇంతకన్నా అదృష్టం ఏముంటుందంటూ.. మొదటిసారి సెట్స్‌లో తారక్, సైఫ్‌ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యానని.. ఇప్పటికీ మేఘాల్లో తేలినట్టుందని.. దేవరలో ఛాన్స్ వచ్చిన కొత్తలో చైత్ర ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది చదవండి: దేవర మూవీలో ఎన్టీఆర్ భార్యగా నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెల్సా.. అస్సలు ఊహించి ఉండరు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..