Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఈసీదే బాధ్యత..! ఈవీఎంలపై వైసీపీ – కూటమి నేతల మధ్య డైలాగ్‌ వార్‌..

ఏపీలో ఈవీఎం కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ- కూటమి నేతల మధ్య డైలాగ్‌ వార్‌ పీక్స్‌కు చేరింది. ఈవీఎం రీ -వెరిఫికేషన్‌కు పట్టుబడుతున్నారు వైసీపీ నేతలు. ఫలితాలు ప్రకటించిన రెండు నెలలకు అనుమానాలా ! అన్ని ప్రశ్నిస్తున్నారు కూటమి నాయకులు. ఫిర్యాదు సరే మరి ఈసీ రియాక్షన్‌ ఏంటి?

Andhra Pradesh: ఈసీదే బాధ్యత..! ఈవీఎంలపై వైసీపీ - కూటమి నేతల మధ్య డైలాగ్‌ వార్‌..
Evm Verification
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 28, 2024 | 7:46 AM

2024 ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నాయంటూ వైసీపీ నేతలు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. ఈసీ ప్రకటించిన పోలింగ్‌ శాతానికి.. కౌంటింగ్‌లో చూపిన పోలీంగ్‌ పర్సంటేజీకి మధ్య తేడా వుండడం అనుమానాలకు తావిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.. ఎన్నికలు జరిగిన రోజు ఈసీ ఫైనల్‌గా 80.66 శాతం పోలింగ్‌ నమోదయినట్టు ప్రకటించిందన్నారు. జూన్‌4న కౌంటింగ్‌లో మాత్రం పోలింగ్‌ పర్సెంటేజీని 82శాతంగా చూపారన్నారు అంబటి. ఈ తేడా ఎందుకొచ్చింది? ఇన్ని రోజులైనా పార్టీల వారీగా ఓట్లను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారాయన. ఇక ఈవీఎం బ్యాటరీ చార్జింగ్‌ 99 శాతం ఉండడం ఏంటన్నారు. భద్ర పరిచాక బ్యాటరీ ఛార్జింగ్‌ ఎలా పెరుగుతుందన్నారు. వీవీ ప్యాడ్‌లను లెక్కించమమే మాక్‌ పోలింగ్‌ అంటున్నారు. ఈవీఎంల తనిఖీ కోసం వెళ్తే అధికారులు తమ దగ్గర తాళం చెవి లేదని చేతులెత్తేశారని.. ఇలా ప్రతీ అంశం అనుమానాస్పదంగా వుందన్నారు. తమకు ఉన్న సందేహాలు ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

కాగా.. ఈవీఎంలపై వైసీపీ ఈసీని ఆశ్రయించడాన్ని కూటమి నేతలు తప్పు పట్టారు. ప్రజాతీర్పును వైసీపీ గౌరవించాలన్నారు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ. ఫలితాలు ప్రకటించిన రెండు నెలల తరువాత అనుమానాలేంటన్నారాయన. ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశం లేదన్నారు మంత్రి సత్యకుమార్‌. ఓటమికి కారణాలను విశ్లేషించుకోవాల్సింది పోయి ఈవీఎంలపై అనుమానాలంటూ వైసీపీ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు . 2019లో ఈవీఎంలపై వైసీపీకీ డౌట్లు రాలేదా? అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ప్రశ్నించారు.

ఈవీఎంలపై తలెత్తుతోన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదని వైసీపీ అంటోంది.ఇదంతా ప్రజల దృష్టి మర్చలాడినికి వైసీపీ వేసిన ఎత్తుగడ అంటున్నారు కూటమి నేతలు. అలా ఈవీఎంల కేంద్రంగా ఏపీ పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డీల్ కుదిరిందని పిలిచి.. ఏకంగా కుటుంబాన్నే కిడ్నాప్..
డీల్ కుదిరిందని పిలిచి.. ఏకంగా కుటుంబాన్నే కిడ్నాప్..
స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్.. చిక్కుల్లో 'ఎంపురాన్' సినిమా !
స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్.. చిక్కుల్లో 'ఎంపురాన్' సినిమా !
ఎన్‌సీసీ ఫైరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పుడు టాలీవుడ్ నటి
ఎన్‌సీసీ ఫైరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పుడు టాలీవుడ్ నటి
వందల కోట్ల ఆశ చూపించి.. గ్రామస్తులను మోసం చేసిన నటుడు
వందల కోట్ల ఆశ చూపించి.. గ్రామస్తులను మోసం చేసిన నటుడు
సర్కార్ బడిలో షాకింగ్ సీన్.. పిల్లల ముందే చితకబాదుకున్న టీచర్లు!
సర్కార్ బడిలో షాకింగ్ సీన్.. పిల్లల ముందే చితకబాదుకున్న టీచర్లు!
ఉగాది రోజు బాలయ్య ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌!
ఉగాది రోజు బాలయ్య ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌!
ఐపీఎల్‌లో ట్రావిస్ హెడ్ బద్దలు కొట్టే ఐదు రికార్డ్స్..
ఐపీఎల్‌లో ట్రావిస్ హెడ్ బద్దలు కొట్టే ఐదు రికార్డ్స్..
సైడ్ క్యారెక్టర్స్ టు క్రేజీ హీరోయిన్‌గా..
సైడ్ క్యారెక్టర్స్ టు క్రేజీ హీరోయిన్‌గా..
రేషన్ కార్డుదారులకు ఉగాది కానుక.. ఏప్రిల్ 1 నుంచి..
రేషన్ కార్డుదారులకు ఉగాది కానుక.. ఏప్రిల్ 1 నుంచి..
స్టేడియంలో జాస్మిన్ వాలియా! పాండ్యా ప్రేమకథ మళ్లీ హాట్ టాపిక్..
స్టేడియంలో జాస్మిన్ వాలియా! పాండ్యా ప్రేమకథ మళ్లీ హాట్ టాపిక్..