నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికల ఫలితాలు 2024
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన కీలక నేత. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడిగా మంచి గుర్తింపు పోందారు. తన అన్ననల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో స్థాపించిన జై సమైఖ్యాంధ్ర పార్టీతో రాజకీయ తేరంగేట్రం చేశారు. 2014 వచ్చిన సాధారణ ఎన్నికల్లో అదే పార్టీ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత రాజకీయంగా కాస్త వెనుకబడినప్పటికీ 2017లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధికారంలో ఉండటంతో ఆయనకు ఏపీ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వరించింది. దీంతో పాటు కొంతకాలం ఏపీ జలవనరుల అభివృద్ది శాఖ ఛైర్మన్గా కూడా కొనసాగారు. ప్రస్తుతం 2024లో మరోసారి పీలేరు నుంచే టీడీపీ తరఫున బరిలో దిగేందుకు సిద్దమయ్యారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. చింతల రామచంద్రా రెడ్డికి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మధ్య రాజకీయంగా వైరం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ప్రత్యర్థిగా నిలిచి విజయం సాధిస్తారా లేదా అనేది వేచి చూడాలి.