Telangana: రచ్చబండను మెప్పించి.. అసెంబ్లీ మెట్లెక్కారు.. నాటి సర్పంచ్‌లే నేటి ఎమ్మెల్యేలు..
గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు.. గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది.. గ్రామాలను పాలించే ప్రథమ పౌరుడు నిజాయితీగా పాలించి ప్రజల చేత ప్రశంసలు పొందగలితే వారికి రాజకీయ అవకాశాలు కూడా అలాగే వెతుక్కుంటూ వస్తాయి.. ఒకప్పుడు సర్పంచ్ లుగా గ్రామ అభివృద్దికి బాటలు వేసిన ఈ నేతలు అవకాశాలు అందిపుచ్చుకుని ఇప్పుడు MLA లు అయ్యారు..

చట్టసభల్లో రాణించాలంటే సర్పంచ్ పీఠం లెర్నింగ్ స్టేజ్.. ఒకప్పుడు సర్పంచ్‌లుగా వారి గ్రామాల అభివృద్దికి బాటలువేసిన ఆ నేతలు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా శాసనసభలో గళమెత్తుతున్నారు.. గ్రామంలోని రచ్చబండలో రాణించి ఇప్పుడు MLA లుగా ఆ నియోజకవర్గాలను శాసిస్తున్నారు.. సర్పంచ్ అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరూ..! సర్పంచ్ నుంచి ఏ విధంగా చట్టసభల్లోకి అడుగుపెట్టారు.. అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..
గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు.. గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది.. గ్రామాలను పాలించే ప్రథమ పౌరుడు నిజాయితీగా పాలించి ప్రజల చేత ప్రశంసలు పొందగలితే వారికి రాజకీయ అవకాశాలు కూడా అలాగే వెతుక్కుంటూ వస్తాయి.. ఒకప్పుడు సర్పంచ్ లుగా గ్రామ అభివృద్దికి బాటలు వేసిన ఈ నేతలు అవకాశాలు అందిపుచ్చుకుని ఇప్పుడు MLA లు అయ్యారు..
వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని భూపాలపల్లి MLA గండ్ర సత్యనారాయణరావు.. ఒకప్పుడు గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించిన వారే.. గండ్ర సత్యనారాయణరావు స్వగ్రామం గణపురం మండలం బుద్దారం.. 1984 నుండి 1989 వరకు బుద్దారం గ్రామ సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.. ప్రజల చేత ప్రశంసలు పొందిన గండ్ర ఆ తర్వాత 1996లో గణపురం జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు.. అనంతరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
రెండు పర్యాయాలు MLA గా పోటీచేసి ఓటమిపాలైన గండ్ర సత్యనారాయణరావు పట్టువదలకుండా 2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు.. ప్రస్తుతం భూపాలపల్లి MLA గా పరిపాలనలో తన మార్క్ ప్రదర్శిస్తున్నారు.. గ్రామ సర్పంచ్ లుగా బరిలోకి దిగుతున్న నేతలకు తన అనుభవాలు పంచుతున్న ఆయన నిజాయితీగా గ్రామాల అభివృద్దికి పాటు పడితే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని సూచిస్తున్నారు.
ప్రస్తుతం నర్సంపేట MLA గా బాధ్యత నిర్వహిస్తున్న దొంతి మాధవరెడ్డి కూడా ఒకప్పుడు గ్రామ సర్పంచ్ గా ప్రజల చేత ప్రశంసలు పొందిన వారే.. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని చెన్నారావుపేట మండలం అమీనాబాద్ ఆయన స్వగ్రామం.. 1984లో అమీనాబాద్ గ్రామ సర్పంచ్ గా గెలుపొంది తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించిన దొంతి మాధవరెడ్డి 1988 నుండి 2014 వరకు అభినాబాద్ సొసైటీ చైర్మన్ గా పని చేశారు.. 1995 నుండి 2000 సంవత్సరం వరకు వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.. 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మొదటిసారి MLA గా గెలిచారు.
2018 ఎన్నికలో ఓటమిపాలైన దొంతి మాధవరెడ్డి తిరిగి 2023 సాధారణ ఎన్నికల్లో మరోసారి నర్సంపేట MLA గా గెలుపొందారు.. ప్రస్తుతం నర్సంపేట MLAగా తన మార్క్ ప్రదర్శిస్తున్న దొంతి మాధవరెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బరిలోకి దిగుతున్న నేతలకు స్పూర్తిగా నిలుస్తున్నారు.
ప్రతి రాజకీయ నాయకుడు ఎదుగుదలకు జన్మనిచ్చిన గడ్డ తొలిమెట్టు అంటున్న ఈ ఎమ్మెల్యేలు.. స్వగ్రామంలో ప్రజల చేత ప్రశంసలు పొందినవారు కచ్చితంగా రాజకీయ రంగంలో రాణిస్తాడని.. జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో, అవకాశం దొరికితే దేశ స్థాయిలో కూడా తన సత్తా చాటుకుని ప్రజలచేత ప్రశంసలు పొందగలరని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
