AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రక్తపాతాలు జరిగిన చోట వెల్లివిరిసిన సామరస్యం.. సర్పంచ్ పదవి ఏకగ్రీవం..

కత్తులు దూసిన ఆ గ్రామంలో అంతా ఒక్కతాటిపైకి రావడంతో శాంతి విరాజిల్లింది.. ఐక్యతా రాగంతో.. సర్పంచ్ పదవికి ఓ మహిళను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో.. ఆ గ్రామం చరిత్రలో నిలిచింది.. ఇది ఎక్కడో కాదు.. తెలంగాణ ఖమ్మం జిల్లాలోని కలకోట గ్రామం.. ఒకప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు.. అనేలా.. గ్రామస్థులందరూ కలిసి రావడం గమనార్హం..

Telangana: రక్తపాతాలు జరిగిన చోట వెల్లివిరిసిన సామరస్యం.. సర్పంచ్ పదవి ఏకగ్రీవం..
Kalakota Village
Shaik Madar Saheb
|

Updated on: Dec 02, 2025 | 9:20 PM

Share

ఆ గ్రామంలో కొన్నేళ్లుగా.. నిత్యం గొడవలే.. కొట్లాటలు.. రక్తపాతాలు.. హత్యలు కూడా జరిగాయి.. స్థానిక ఎన్నికలు వచ్చాయంటే చాలు అనుక్షణం.. భయం.. భయం.. ఇరు వర్గాలు తగ్గేదేలే అంటూ సవాళ్లు చేసుకుంటాయి.. అనునిత్యం గొడవలు.. కొట్లాటలు.. కేసులు.. ఇలా.. నాలుగు దశాబ్దాలుగా రెండు పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేది. అలా సవాల్.. ప్రతి సవాల్ తో కర్రలు.. కత్తులు దూసిన ఆ గ్రామంలో అంతా ఒక్కతాటిపైకి రావడంతో శాంతి విరాజిల్లింది.. ఐక్యతా రాగంతో.. సర్పంచ్ పదవికి ఓ మహిళను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో.. ఆ గ్రామం చరిత్రలో నిలిచింది.. ఇది ఎక్కడో కాదు.. తెలంగాణ ఖమ్మం జిల్లాలోని కలకోట గ్రామం.. ఒకప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు.. అనేలా.. గ్రామస్థులందరూ ఒక్క తాటిపైకి రావడం.. గమనార్హం..

కాంగ్రెస్, సీపీఐ ప్రధాన పార్టీలుగా ఉన్న బోనకల్ మండలంలోని కలకోట గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా.. ఎప్పుడూ రాజకీయ ఘర్షణలు జరగుతుండేవి.. ముఖ్యంగా.. 1983లో సీపీఐ నాయకుడు తూము ప్రకాశరావును.. కాంగ్రెస్‌ వర్గీయులు హత్య చేశారు.. ఆ తర్వాత సంవత్సరం కాంగ్రెస్ నేత పైడిపల్లి వెంకటేశ్వరరావును సీపీఐ వర్గీయులు చంపేశారు. నాటి నుంచి కలకోట గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనేది.. అప్పటి నుంచి జిల్లాలో అత్యంత సమస్యాత్మక గ్రామంగా కలకోట ఉంది. అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి చాలా సార్లు పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు.

Kalakota Pancahyat

Kalakota Elections

ఏ ఎన్నికలు వచ్చినా.. ఇరు పార్టీల నాయకులు ఆధిపత్యం కోసం ప్రయత్నించేవారు.. కొన్నిసార్లు కాంగ్రెస్, మరి కొన్నిసార్లు సీపీఐ నాయకులు సర్పంచ్, ఎంపీటీసీ, సహకార సంఘం, మత్య్స సహకార సంఘం అధ్యక్షులుగా గెలుస్తూ వచ్చారు.. అలాంటి గ్రామంలో ప్రస్తుత పంచాయతీ ఎన్నికలు.. అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చాయి.. అంతా కలిసి సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రాజకీయాలు.. ఘర్షణలు కాదు.. అభివృద్ధి కావాలని కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ నాయకులు భావించి.. సర్పంచ్, పది వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు. సర్పంచ్‌గా పీసీసీ సభ్యుడు పైడిపల్లి కిశోర్‌ కుమార్ సతీమణి అనిత, వార్డు సభ్యులుగా కాంగ్రెస్ నుంచి షేక్‌ హుస్సేన్‌బీ, చావా నరసింహారావు, బాజినేని అచ్యుతరావు, అబ్బూరి కల్పన, తోటపల్లి సువార్త, సీపీఐ నుంచి మాతంగి శ్రీనివాసరావు, యంగల కృష్ణవేణి, బీఆర్ఎస్ నుంచి బలుగూరి సురేశ్, తోటపల్లి కృష్ణ, కొత్తగుండ్ల వేణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..