నిమ్మకాయల చిన్నరాజప్ప ఎన్నికల ఫలితాలు 2024
నిమ్మకాయల చిన్నరాజప్ప.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుడు, తెలుగుదేశం పార్టీలో కీలక సభ్యుడు. 1953, అక్టోబరు 1వ తేదీన కోనసీమ జిల్లా, ఉప్పలగుప్తం మండలం చిన్నరాజప్ప జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రాజప్ప.. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ.. ఎంఏ వరకు చదివారు. ఆ తర్వాత 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి.. రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 1989లో టీడీపీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై.. 2004-2006 మినహా.. 2014 వరకు ఆ పదవిలో సుదీర్ఘంగా కొనసాగిన చరిత్ర చిన్నరాజప్ప సొంతం. 1995లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ ఛైర్మన్‌గా, 1998లో సివిల్ సప్లైస్ ఛైర్మన్‌గా, 2001లో కెనరా బ్యాంక్ డైరెక్టర్‌గా వివిధ పదవులను విజయవంతంగా చేపట్టారు. ఆ తర్వాత 2007 నుంచి 2013 వరకు ఎమ్మెల్సీగా కూడా పనిచేశాడు. 2014 సాధారణ ఎన్నికలలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అదేశానుసారం మెట్ట ప్రాంతమైన పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ ఆధిక్యంతో గెలుపొందారు నిమ్మకాయల చిన్నరాజప్ప. ఇవే కాదు.. 2019లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉపముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. విశ్వసనీయతకు మారుపేరుగా సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అనేక పదవులు చేపట్టి.. అంచెలంచెలుగా మంత్రి స్థాయికి ఎదిగారు చిన్నరాజప్ప. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పని చేస్తూ వచ్చారు నిమ్మకాయల చిన్నరాజప్ప.