బొత్స సత్యనారాయణ ఎన్నికల ఫలితాలు 2024
బొత్స సత్యనారాయణఆంధ్ర ప్రదేశ్‍కు చెందిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖా మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన వైసీపీ సీనియర్ నాయకుడు. 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా విద్యా శాఖ మంత్రిగా నియమితులయ్యారు. బొత్స విజయనగరంలో బొత్స గురునాయుడు ఈశ్వరమ్మ లకు 1958లో జన్మించారు. బొత్స ఝాన్సీ లక్ష్మితో 1985లో జరిగింది. బొత్స సత్యనారాయణ 1999లో బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు. ఆనాడు ఎన్డీఏ హవా వల్ల కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ నుండి కేవలం 5 ఎంపీలని గెలుచుకోగా అందులో బొత్స ఒకరు. 2004, 2009 లలో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారీ పరిశ్రమల శాఖ, పంచాయతీ రాజ్ గృహ నిర్మాణ శాఖ,[6] రవాణా, మార్కెటింగ్ శాఖలకు మంత్రిగా పని చేశారు. ఏపీసీసీ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. 2015 లో, బొత్స కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బొత్స తన కుటుంబం, మద్దతుదారులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. 2019 చీపురుపల్లి నియోజకవర్గం నుండి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు