ధర్మాన ప్రసాద రావు ఎన్నికల ఫలితాలు 2024
ధర్మాన ప్రసాదరావు ఏపీలో సీనియర్ పొలిటీసిన్. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలోమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరగక పూర్వం గల రాష్ట్రానికి రోడ్లు, భవనాల శాఖ, రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో రెవెన్యూ, స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ మంత్రిగా కొనసాగుతున్నారు. అతను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలానికి చెందిన మబగాం గ్రామంలో సావిత్రమ్మ, రామలింగంనాయుడు దంపతులకు 1957 మే 21 న జన్మించారు. కాంగ్రెస్ నుంచి 1989, 1999, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికలలో నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. 1981లో మబగాం గ్రామ సర్పంచ్‌గా, 1982లో బ్లాక్ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, 1987లో పోలాకి మండల తొలి అద్యక్షునిగా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసాడు. 1994లో ఎ.ఐ.సి.సి సభ్యునిగా, 2001లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తన సేవలనందించారు.