ఎమ్మిగనూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
B. Jayanageswara Reddy | 103089 | TDP | Won |
Butta Renuka | 87252 | YSRCP | Won |
M.Khasim Vali | 7831 | INC | Won |
K. Raghavendra | 893 | BSP | Won |
P.Vijaya Lakshmi | 462 | IND | Won |
Mitti Rajasekhar | 388 | IND | Won |
Gavvala Narayana | 250 | IND | Won |
Jagannatha Eranna | 225 | IND | Won |
Nagarjuna Areddy | 184 | JJSP | Won |
Golla Eeranna | 135 | IND | Won |
ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఆ మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి దళిత నేత దామోదరం సంజీవయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 1985 నుంచి ఆ రెండు కుటుంబాలే పోటీ చేస్తూ వస్తున్నాయి. అందులో ఒకటి మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మధ్య వార్ జరుగుతుంది. ఆ రెండు కుటుంబాలలో ఎవరో ఒకరు ఎమ్మెల్యేగా గెలుపొందడం మరొకరు ఓటమి చెందిన జరుగుతూ వస్తోంది. టీడీపీ తరఫున బివి మోహన్ రెడ్డి 1985 నుంచి 1989, 1994, 1999 ఎన్నికలలో వరుసగా గెలుపొందారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి విజయం మొదలైంది. 2004 2009 2012 ఉప ఎన్నికలలో కూడా చెన్నకేశవరెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నికలలో మోహన్ రెడ్డి కొడుకు జయ నాగేశ్వర్ రెడ్డి గెలుపుండగా చెన్నకేశవరెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. పట్టు వదలని విక్రమార్కుడి లాగా చెన్నకేశవరెడ్డి తిరిగి గత 2019 ఎన్నికలలో పోటీ చేసి జయ నాగేశ్వర్ రెడ్డిపై గెలుపొందారు. దీనిని బట్టి చూస్తే నియోజకవర్గంలో ఆ రెండు కుటుంబాలకు ఉన్న ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెన్నకేశవరెడ్డి ఉన్నప్పటికీ వైసీపీ బీసీ వర్గానికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకను రానున్న ఎన్నికలలో రంగంలోకి దించింది. బీసీ ఓటర్లు అధికంగా ఉండటంతో వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. రెండు లక్షల ఇరవై రెండు వేల పైగా ఓటర్లు ఉన్న ఎమ్మిగనూరు అసెంబ్లీలో ఈసారి వైసీపీ నుంచి బుట్టా రేణుక టీడీపీ నుంచి జయ నాగేశ్వర్రెడ్డి తలపడబోతున్నారు. ఎన్నికలలో విజయం ఎవరిది అనేది రానున్న రోజుల్లో తేలని ఉంది.