టెక్కలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Kinjarapu Atchannaidu | 107923 | TDP | Won |
Duvvada Srinivas | 73488 | YSRCP | Won |
Killi Krupa Rani | 2684 | INC | Won |
Chintada Srinivasa Rao | 794 | BSP | Won |
Attada Rajesh | 614 | IND | Won |
Geddavalasa Ramu | 482 | IND | Won |
Bypalli Parameswararao | 386 | JBNP | Won |
టెక్కలి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా లోగలదు. ఇది శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది. కోటబొమ్మాళి, టెక్కలి, నందిగం, సంతబొమ్మాళి మండలాలు ఈ నియోజకవర్గం కిందకి వస్తాయి. రొక్కం లక్ష్మీ నరసింహం దొర ఈ నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కింజరాపు అచ్చెన్నాయుడు ఇక్కడ తొలిసారి విజయం సాధించారు. వైసీపీ నుంచి బరిలోకి దిగిన దువ్వాడ శ్రీనివాస్‌పై 8,387 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ అచ్చెన్నాయుడు టీడీపీ నుంచి పోటీ చేసి మరోసారి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన పేరాడ తిలక్‌పై 6,545 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గడిచిన రెండు ఎన్నికల్లో విజయం సాధించిన అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ విజయంపై దృష్టి సారించి పని చేస్తున్నారు. ఇక్కడి నుంచి 2014లో గెలిచిన అచ్చెన్నాయుడు విభజన తరువాత ఏపీలో ఏర్పడిన తొలి కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ప్రతీసారీ ఇక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి.