వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు 2024
వైఎస్ జగన్ పూర్తి పేరు యెదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి- విజయమ్మ దంపతులకు 1972 డిసెంబర్ 21న కడప జిల్లాలోని పులివెందులలో జన్మించారు. 1991 నుంచి 1994 వరకు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12వ గ్రేడు వరకు విద్యనభ్యసించారు. ఆ తరువాత బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ డిగ్రీని హైదరాబాద్‌లోని కోఠీ మహావిద్యాలయ డిగ్రీ అండ్ పి.జి. కళాశాలలో పూర్తిచేశారు. డిగ్రీ పూర్తి అయిన తరువాత లండన్ వెళ్లి అక్కడ ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత బిజినెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో బెంగళూరులో తన సొంత కంపెనీ స్టార్ట్ చేసి బిజినెస్ చేశారు. ఈ క్రమంలోనే సిమెంట్ ఫ్యాక్టరీ, సాక్షి న్యూస్ ఛానల్ , తండూరు జల విద్యుత్ ప్రాజెక్టును స్థాపించారు. ఈ క్రమంలోనే 1996 ఆగస్టు 28న పులివెందులలో భారతీ గారి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరూ పిల్లలు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వైయస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చారు. 2009 జనరల్ ఎలక్షన్స్ లో కడప ఎంపీగా పార్లమెంటుకు పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలుపొందారు. అనతికాలంలోనే ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి సమయంలో 29 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తండ్రి వైఎస్ఆర్ తర్వాత ఓదార్పు యాత్రతో జగన్ జనానికి దగ్గరయ్యారు. 2011 మార్చి 11న ఇడుపులపాయలను తన తండ్రి సమాధి వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీని అఫీషియల్ గా ప్రకటించారు. 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ పదహారు ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. మరోవైపు.. ప్రజాసంకల్ప యాత్ర మొదలుపెట్టి మొత్తంగా 341 రోజులపాటు ఈ సంకల్పయాత్ర సాగింది సంకల్ప యాత్రలో భాగంగా 3648 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రతి పల్లె పల్లె తిరిగారు. 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్ నమ్మి అధికారాన్ని అప్పగించారు. ఈ ఎన్నికల్లో 175 శాసన సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ 25 లోక్‌సభ స్థానాలకు గాను 22 స్థానాలను గెలుచుకుంది. ఇక ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ క్లిన్ స్విప్ దిశగా దూసుకుపోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.