అనకాపల్లి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Konathala Ramakrishna | 115126 | JSP | Won |
Bharath Kumar Malasala | 49362 | YSRCP | Won |
I. R. Gangadhar | 1895 | INC | Won |
Sudikonda Manikyala Rao | 1306 | BSP | Won |
Kanisetty Suresh Babu | 700 | JBNP | Won |
Kaparapu Satyanarayana | 652 | IND | Won |
V.V. Ramachandra Rao Surisetty | 436 | PREMJD | Won |
Venkat Yadav Ommi | 385 | SP | Won |
Alla Satti Raju | 314 | IND | Won |
Dommesi Apparao | 275 | RPI (K) | Won |
Ambikadevi Polamarasetty | 245 | PPOI | Won |
Thota Venkata Sai Mukund | 229 | PRAJPP | Won |

అనకాపల్లి ఉమ్మడి విశాఖ జిల్లాలోని నియోజకవర్గం. జిల్లాల విభజన తర్వాత అనకాపల్లి కేంద్రంగా ఒక జిల్లాను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గానికి తొలిసారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 15 సార్లు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు టీడీపీ అభ్యర్థుల విజయం సాధించగా, ఇదే నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు దాడి వీరభద్రరావు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,45,955 మంది ఓటర్లు ఉన్నారు. వీరులో పురుషులు 1,19146 మంది ఓటర్లు కాగా, మహిళా ఓటర్లు 1,26,793 మంది ఉన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన పీజీ సత్యనారాయణ ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి బరిలోకి దిగిన కొణతాల రఘునాథ్ పై 22,341 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుడివాడ అమర్నాథ్ ఇక్కడ విజయం సాధించారు. తెలుగుదేశం నుంచి పోటీ చేసిన పీలా గోవిందపై 8,169 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎంతోమంది రాష్ట్రంలో ఏర్పడిన మంత్రివర్గంలో మంత్రులుగా పని చేశారు. గతంలో దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ, గంటా శ్రీనివాసరావు మంత్రులుగా పని చేయగా, గడిచిన ఎన్నికల్లో ఎక్కడి నుంచి విజయం సాధించిన గుడివాడ అమర్నాథ్ కూడా మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ బరిలోకి దిగారు. అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్నాథ్‌ను తప్పించి మన్సాల భరత్ కుమార్ అనే కొత్త వ్యక్తిని వెఎస్సార్‌సీపీ బరిలోకి దించింది.
అన్న అప్పుడు.. తమ్ముళ్లు ఇప్పుడు.! మెగా బ్రదర్స్.. మెగా హిట్..
రావడం కాస్త లేటవ్వచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా.. ఈ డైలాగ్ గుర్తుందా.. ఇది ఇప్పుడు మెగా ఫ్యామెలీకి పెర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎప్పుడో 80వ దశకంలో మెగాస్టార్‌తో మొదలైన కొణిదెల ఫ్యామెలీ వెండితెర ప్రయాణం దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతునే ఉంది. చిరంజీవి తర్వాత ఒక్కొక్కరుగా వాళ్ల ఫ్యామెలీ మెంబర్స్ మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ వచ్చారు. చిరు తర్వాత నాగబాబు నటుడిగా, నిర్మాతగా కెరీర్ కొనసాగించగా.. ఆ తర్వాత వచ్చిన పవన్ కల్యాణ్.. పవర్ స్టార్‌గా ఇండస్ట్రీని శాసిస్తూ వస్తున్నారు.
- Anil kumar poka
- Updated on: Dec 14, 2024
- 9:31 PM
తిరుపతి లడ్డూ కల్తీపై ఘాటుగా స్పందించిన ఖుష్బూ
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి లడ్డూ కల్తీ కావడం పట్ల తిరుపతిని శుద్ధి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నటి ఖుష్బూ కూడా ఈ వివాదంపై స్పందించారు. ఎక్స్‌లో ఆమె తను అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
- Velpula Bharath Rao
- Updated on: Sep 27, 2024
- 5:53 PM
ఈవీఎంలపై వైసీపీ - కూటమి నేతల మధ్య డైలాగ్ వార్..
ఏపీలో ఈవీఎం కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ- కూటమి నేతల మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది. ఈవీఎం రీ -వెరిఫికేషన్‌కు పట్టుబడుతున్నారు వైసీపీ నేతలు. ఫలితాలు ప్రకటించిన రెండు నెలలకు అనుమానాలా ! అన్ని ప్రశ్నిస్తున్నారు కూటమి నాయకులు. ఫిర్యాదు సరే మరి ఈసీ రియాక్షన్ ఏంటి?
- Shaik Madar Saheb
- Updated on: Aug 28, 2024
- 7:46 AM
నిలిచిన ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ.. బాలినేని కీలక వ్యాఖ్యలు..
ఒంగోలులో ఎలక్షన్ కమిషన్ అధికారులు చేపట్టిన 12 పోలింగ్ బూత్‌ల్లోని ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రీవెరిఫికేషన్ జరగడం లేదంటూ మాక్ పోలింగ్‌కు హాజరైన వైసీపీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రీవెరిఫికేషన్ ప్రక్రియను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించి బయటకు వెళ్ళిపోయారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 19, 2024
- 9:47 PM
లక్కీ ఛాన్స్ కొట్టేస్తున్న మహిళా టీచర్లు..!
ఏపీలో ఓ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ ట్రెండు ఇప్పుడేమి కొత్తగా మొదలైందీ కాదు..! ఓ సినిమాలో నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా.. అన్నట్లు ఇక్కడ వ్యవహారం ఉంది. అయితే ఇక్కడ అదే ట్రెండు ఫాలో అవుతూ జాక్‌పాట్ కొట్టేస్తున్నారు ఆ మహిళా నేతలు.
- B Ravi Kumar
- Updated on: Jun 19, 2024
- 12:51 PM
'వెల్‌కమ్ చీఫ్'.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మనోజ్ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఏపీ క్యాబినేట్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన పదవి దక్కింది. వీటితో పాటు పవన్ ఆశించిన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అలాగే పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను జనసేన అధినేతకు అప్పగించారు.
- Basha Shek
- Updated on: Jun 15, 2024
- 7:07 PM
మహిళలా మజాకా.. దేశంలో 33శాతం రిజర్వేషన్ లేకుండానే 55శాతం విజయం..
చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ దశాబ్దాలుగా మహిళలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్లు లేకపోయినా ఆ జిల్లాలో మాత్రం 55% శాతం మహిళలే చట్టసభలకు వెళ్తుండటం అందరిని ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. అంతే కాకుండా ఆ జిల్లాను నడుపుతున్న అధికారులు సైతం మహిళలే కావటం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇంతకీ 50 శాతం దాటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లా ఏది? అక్కడ మహిళలు ఎవరు? అనుకుంటున్నారా? అదే ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన విజయనగరం.
- G Koteswara Rao
- Updated on: Jun 14, 2024
- 1:46 PM
ఏపీ ఫలితాల తర్వాత వైసీపీకి మరో అగ్నిపరీక్ష.. రంగంలోకి కీలక నేతలు
ఎన్నికలు ముగిశాయి. కూటమికి అనూహ్య విజయం లభించింది. కనీవిని ఎరుగని రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాలను దక్కించుకున్న కూటమి తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థలు, కార్పొరేషన్ల పై దృష్టి సారించాయి. వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు వైసిపి నాయకత్వంలోనే ఉన్నాయి. వాటిన్నంటిపై దృష్టిసారించింది కూటమి. ముందుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‌పై కూటమి నేతలు దృష్టి సారించారు. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 7 మంది ఎమ్మెల్యేలకు గానూ విశాఖ నగరం పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నాయి.
- Eswar Chennupalli
- Updated on: Jun 14, 2024
- 10:56 AM
ఆవిధంగా వ్యవహరిస్తారని తానెప్పుడూ అనుకోలేదు.. ఈ అధికారులపై ఫోకస్
తన పరిపాలన ఎలా ఉండబోతుందో ఫస్ట్ మీటింగ్‌లోనే శాంపిల్ చూపించారు సీఎం చంద్రబాబు. తన ప్రాధాన్యతలేంటో, ప్రజలు ఆకాంక్షలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పుకొచ్చారు. అదే టైమ్‌లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లపై హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే అఖిలభారత సర్వీస్ అధికారులతో సమావేశమయ్యారు చంద్రబాబు. పాలనలో కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లతో కాసేపు మాట్లాడారు. తనపై ఎంతో పెద్ద బాధ్యత ఉందంటూ ఐఏఎస్, ఐపీఎస్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
- Srikar T
- Updated on: Jun 14, 2024
- 6:15 AM
పవర్ స్టార్ ఫ్యాన్ అంటే మామూలుగా ఉండదు.. శపథం చేసి చివరకు..
ఈ ఫోటోలో ఉన్నది ఆడా.. మగా అర్ధం కావట్లేదా. మరొక్కసారి బాగా చూడండి అయినా అర్ధం కాకపోతే పూర్తి వివరాలు చదవాలి. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఇతని పేరు తోట నరేంద్ర. ఊరు.. తెనాలి సమీపంలోని కొలకలూరు. అది 2019వ సంవత్సరం.. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అతని అభిమాన నటుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో నరేంద్ర తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ నాయకుడు రెండు చోట్ల పరాజయం పాలవ్వడం తీవ్ర వేదనకు గురి చేసింది.
- T Nagaraju
- Updated on: Jun 14, 2024
- 5:59 AM
ఎన్నికల వార్తలు 2024








