నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Kotamreddy Sridhar Reddy | 109975 | TDP | Won |
Adala Prabhakara Reddy | 75495 | YSRCP | Won |
Shaik Fayaz | 4280 | INC | Won |
Fazil Syed | 957 | SDPI | Won |
Sriramulu Bodeddula | 684 | BSP | Won |
Anil Kumar Surisetty | 592 | RSP | Won |
Shaik Sardar Hussien | 167 | IND | Won |
Shaik Mujeeb | 155 | IND | Won |
Katta Sireesh | 100 | AKBHJS | Won |
Bommalata Suresh | 75 | IND | Won |
Jadda Niranjan | 46 | IND | Won |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒకటి.. నెల్లూరు సిటీ, రాపూరు, సర్వేపల్లి నియోజకవర్గాలను విడదీసి ఈ నియోజవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెగ్మెంట్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ నుంచి ఆనం వివేకానంద రెడ్డి గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ 2019లో మాత్రమే మొదటిసారి పోటీ చేసింది. అప్పట్లో నెల్లూరు రూరల్ రాజకీయంలో జరిగిన మార్పులు అనూహ్యం అనే చెప్పాలి. ఆదాల ప్రభాకర్‌రెడ్డికి టీడీపీ నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చాక.. రెండు రోజులు ప్రచారం చేశాక.. ఆయన వైసీపీలో చేరిపోయారు. సడెన్‌గా వైసీపీ ఎంపీగా నామినేషన్ వేశారు. దీంతో అప్పటికప్పుడు అబ్దుల్ అజీజ్‌ను బరిలో దించింది టీడీపీ. సో, వైసీపీకి తిరుగులేకుండా పోయింది. అయితే, ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికలు ఒక ఎత్తు.. 2024లో నెల్లూరు రూరల్‌లో జరగబోయే ఎన్నికలు మరో ఎత్తు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ప్రస్తుతం నెల్లూరు రూరల్‌లో గెలవడం వైసీపీకి బిగ్గెస్ట్ ప్రెస్టేజ్ ఇష్యూ. ఏపీ సీఎం జగన్ శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఆ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నారు. ఈసారి టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న కోటంరెడ్డిని బలంగా ఢీకొట్టాలనుకుంటోంది వైసీపీ. అందుకే, ఆదాల ప్రభాకర్‌ను బరిలో దించింది.