భూమా అఖిల ప్రియ ఎన్నికల ఫలితాలు 2024
భూమా అఖిల ప్రియ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రాజకీయనాయకురాలు. అఖిల ప్రియ 2 ఏప్రిల్ 1987లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కర్నూల్ జిల్లా, ఆళ్ళగడ్డలో భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి దంపతులకు జన్మించింది. 2014 లో ఆళ్ళగడ్డ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటక, తెలుగు భాష, సంస్కృతి శాఖల మంత్రిగా పని చేసింది. ఆ తర్వాత 2019 లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గంలోపోటీ చేసి, ఓడిపోయారు. కాగా ఈ ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని నిర్ణయించడానికి టీడీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు ప్రధాన అడ్డంకిగా మారాయి. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య వైరం కారణంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఇద్దరు నేతలు టీడీపీకి చెందిన వారే కావడం గమనార్హం. అయితే పార్టీ బాధ్యతను భుజాన వేసుకున్న అఖిలప్రియ ఓటర్ల హృదయాలను గెలుచుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. గతంలో ఆళ్లగడ్డలో చంద్రబాబు నిర్వహించిన "రా కడలి రా" బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. ఈ సమావేశం ఘన విజయం సాధించడంతో ఆమె గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అఖిల ప్రియ సభను విజయవంతం చేయడంలో సఫలమైనప్పటికీ పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుంది.