పుంగనూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Peddireddy Ramachandra Reddy | 100793 | YSRCP | Won |
Challa Ramachandra Reddy | 94698 | TDP | Won |
Bode Ramachandra Yadav | 4559 | BCYP | Won |
G Murali Mohan Yadav | 3571 | INC | Won |
K S Anwar Basha | 1906 | SDPI | Won |
Vasanthapalli Suresh | 687 | BSP | Won |
G Ramaiah | 314 | IND | Won |
Ivuri Nageswar Rao | 242 | IND | Won |
పుంగనూరు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గం. ఈ ఊరికి "టెంపుల్స్ ఆఫ్ సిటీ" అని పేరు ఉంది. బ్రిటిష్ హయాంలో దొరల కోట ఒకటి ఈ వూళ్ళో ఉంది. ఇక పుంగనూరు ఆవులకు కూడా ప్రసిద్ది. అయితే చారిత్రాత్మకంగా ఎంత పేరుందో.. రాజకీయంగా అంతకంటే పేరుంది ఈ నియోజకవర్గానికి. అయితే ఈ నియోజకవర్గం చరిత్రను గమనిస్తే మొదట్లో కాంగ్రెస్ కంచుకోటగా.. ఆ తర్వాత టీడీపీ అభ్యర్ధులకు అడ్డాగా.. గత పదేళ్లుగా వైసీపీ కంచుకోటగా మారిపోయింది. అయితే నియోజకవర్గంలో రెడ్లు మినహా ఇతర సామాజిక వర్గాలకు గెలిపించే పరిస్దితి లేదు. పుంగనూరు అసెంబ్లీ సీటులో ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడు సార్లు వరుసగా ఇక్కడ నుంచి గెలిచారు. ఇక్కడ పెద్దిరెడ్డి బలమైన నేతగా ఉన్నారు. అయితే ఈసారి టీడీపీ పుంగనూరును దక్కించుకోవాలని తీవ్ర కసరత్తులు చేస్తుండటంతో 2024 ఎన్నికలు ఆసక్తిగా మారనున్నాయి.