పోయినసారి ఒక్క ఓటుతో ఓడిపోయాడు.. కట్ చేస్తే.. ఈసారి డబ్బాలతో నామినేషన్‌కు..
గత ఎన్నికల్లో ఒక్క ఓటుతో ఓటమి ఆ అభ్యర్థిని వెంటాడింది.. అందుకే మళ్లీ ఎలాగైనా గెలవాలని డిపాజిట్ కోసం ఒక్కో రూపాయి జమ చేసుకున్నాడు. అలా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా మొత్తం ఒక్క రూపాయి బిళ్లలతోనే నామినేషన్ వేశాడు. ఇలా వార్డ్ మెంబర్‌గా ఓడిపోయిన ఆ యువకుడి పొలిటికల్ స్టోరీ తెలియాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..

గత ఎన్నికల్లో ఒక్క ఓటుతో ఓటమి ఆ అభ్యర్థిని వెంటాడింది.. అందుకే మళ్లీ ఎలాగైనా గెలవాలని డిపాజిట్ కోసం ఒక్కో రూపాయి జమ చేసుకున్నాడు. అలా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా మొత్తం ఒక్క రూపాయి బిళ్లలతోనే నామినేషన్ వేశాడు. ఇలా వార్డ్ మెంబర్‌గా ఓడిపోయిన ఆ యువకుడి పొలిటికల్ స్టోరీ.. ఇప్పుడు అధికారులతో పాటు.. స్థానికులను ఆకట్టుకుంది. ఇదిగో అయ్యప్ప మాలలో ఉన్న ఈ స్వామి పేరు జంగిలి మహేందర్.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన జంగిలి మహేందర్ సర్పంచ్ కోసం నామినేషన్ వేశాడు.
వినూత్నంగా ఉండాలనే ఉద్ధేశంతో పాటే.. చాలాకాలంగా తన గల్లా పెట్టెలో ఒక్కో రూపాయి చొప్పున దాచుకున్న చిల్లర డబ్బులన్నీ జమ చేసి.. వెయ్యి రూపాయల నాణాలతో నామినేషన్ దాఖలు చేశాడు. రూపాయి విలువ అందరికీ తెలియజేయడంతో పాటే.. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క ఓటుతో వార్డ్ మెంబర్ కు పోటీ చేసి తాను ఓటమి పాలవ్వడంతో ఎలాగైనా గెలవాలన్న తపనతో ఒక్క రూపాయి కాయిన్ ను ఎంచుకున్నానని.. జంగిలి మహేందర్ తెలిపాడు.
వీడియో చూడండి..
స్థానిక సమరమేమోగానీ.. ఊళ్లల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో ఆసక్తికర కహానీ వెలుగులోకొస్తోంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ అసలు సమయమేర్పడకుండానే సాగిపోతోందంటున్నారు అధికారులు.. మొత్తానికి ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
