లక్కీ మహిళ.. వెతుక్కుంటూ వచ్చిన సర్పంచ్ పదవి వీడియో
ఆరు పదుల వయసులో ఆ వృద్ధురాలికి రిజర్వేషన్ రూపంలో ఊహించని అదృష్టం వరించింది. సర్పంచ్ పదవి వెతుక్కుంటూ వచ్చి ఇంటి తలుపు తట్టింది. అంతే కాదు మల్లమ్మ గారు.. మీరు మాపార్టీలో చేరండి అంటే లేదు మాపార్టీలోనే చేరాలంటూ ఆమెను ప్రధాన పార్టీలన్నీ రిక్వెస్ట్ చేస్తున్నాయి. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఆశాలపల్లి గ్రామంలోనిదీ సీన్. ఈ గ్రామ పంచాయతీ SC మహిళకు రిజర్వ్ అయింది. కానీ.. ఆ గ్రామంలో కేవలం ఒక్క ఎస్సీ కుటుంబం మాత్రమే ఉంది. ఆ ఇంట్లో కూడా ఒక్కరే మహిళ ఉన్నారు. ఆమె పేరే కొంగర మల్లమ్మ. ఈమె వయసు అరవై ఏళ్లు. కఠిక పేదరికంలో.. పెన్షన్ డబ్బులు, రేషన్ బియ్యంతో కాలం నెట్టుకొస్తోంది. ఆలాంటి ఈ మహిళ ఇప్పుడు గ్రామానికి సర్పంచ్ కాబోతోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం రొటేషన్ పద్ధతిలో సర్పంచ్ సీటు ఎస్సీ మహిళకు రిజర్వ్డ్ అయింది. అయితే ఈ గ్రామ పంచాయతీ మొత్తంలో కొంగర మల్లమ్మ ఒక్కరే ఎస్సీ మహిళ ఉండడంతో దాదాపుగా ఆమెకే సర్పంచ్ పదవి డిసైడ్ అయ్యింది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆ ఊరు మొత్తం ఒక్క మహిళకే అర్హత ఉండటంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎలాగైనా మల్లమ్మను మచ్చిక చేసుకుని తమ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. తనకు రిజర్వేషన్ రూపంలో సర్పంచ్ పదవి వెతుక్కుంటూ ఇంటికి రావడంతో ఆ నిరుపేద మహిళ ఆనందం వ్యక్తం చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో
వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో
” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో
ఎదురు తిరిగిన సంజనా.. నాగ్ సీరియస్! హౌస్ డోర్స్ ఓపెన్ వీడియో
వైరల్ వీడియోలు
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో
44 ఏళ్లుగా పూరి గుడిసెలో గుట్టలా పెరిగిన పాముల పుట్ట వీడియో
