ఉగ్రరూపం దాల్చిన దిత్వా తుఫాను..ఏపీ,తెలంగాణలో భారీ వర్షాలు వీడియో
నైరుతి బంగాళాఖాతంలోని శ్రీలంక తీరంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను.. ఉత్తర-వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది. ప్రస్తుతం పుదుచ్చేరికి 330 కి.మీలు, చెన్నైకి 430 కి.మీల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం కోస్తాంధ్రలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుతుందని తెలిపింది.
దిత్వా తుపాను ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరం వైపు వేగంగా కదులుతున్న నేపథ్యంలో తమిళనాడులోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ శనివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాను కారణంగా అతి భారీ వర్షాలు, ప్రచండ గాలులతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం ‘దిత్వా’ తుపాను శనివారం శ్రీలంక తీరాన్ని దాటి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి, మరింత బలపడే అవకాశం ఉంది. ఇది నవంబర్ 30వ తేదీ తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని ఐఎండీ వెల్లడించింది.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో
వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో
” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో
ఎదురు తిరిగిన సంజనా.. నాగ్ సీరియస్! హౌస్ డోర్స్ ఓపెన్ వీడియో
వైరల్ వీడియోలు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
