” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మరో పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్‌లు చాలా డిమాండింగ్‌గా ఉన్నాయని, డైరెక్టర్లు తన ప్రాణాలు తోడేస్తున్నారంటూ విజయ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కింగ్డమ్ సినిమాతో తన అభిమానులకు నయా ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. లొకేషన్లు మారుస్తూ, అనుకున్న సమయానికి తన సినిమాలను విడుదల చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే తన కష్టాన్ని అభిమానులకు తెలియజేస్తూ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ దర్శకుడు రవికిరణ్ కోలా డైరెక్షన్లో రౌడీ జనార్ధన సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటే, ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్లో మరో పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ లోనూ విజయ్ చురుగ్గా పాల్గొంటున్నారు.
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
