కొలుసు పార్థసారథి ఎన్నికల ఫలితాలు 2024
కొలుసు పార్థసారథి.. ఆంధ్రప్రదేశ్‌లోని కీలక నేతల్లో ఒకరు.. పార్థసారథి 1965 ఏప్రిల్ 18న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కరకంపాడులో రాజకీయ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి, కొలుసు పెదారెడ్డి.. ఆయన 1991, 1996లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కొలుసు పార్థసారథి.. కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి YSRCP ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్థసారథి 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్థసారధి కాంగ్రెస్ పార్టీ నుంచి 2004 (వుయ్యూరు), 2009 (పెనమలూరు)లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో వైసీపీలో చేరిన పార్థసారథి మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికలలో పెనమలూరు నుంచి పోటీ చేసి ప్రస్తుత బోడె ప్రసాద్‌పై 11,317 మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం పార్థసారధి టీడీపీలో చేరి నూజివీడు నుంచి పోటీచేస్తున్నారు. వైసీపీ నుంచి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పోటీచేస్తున్నారు.