AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హామీలు నెరవేర్చకపోతే.. పదవి నుంచి తొలగించండి.. బాండ్ పేపర్‌తో సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం

తెలంగానలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి జోరుగా కొనసాగుతుంది. గ్రామ సర్పంచ్ అయ్యేందుకు రాజకీయ నేతలు పడుతున్న కష్టాలు అంత, ఇంత కాదు. ఏకగ్రీవం కోసమైతే ఏకంగా విలువైన భూములు, భారీగా డబ్బులు సమర్పించుకుంటున్నారు. అయితే వీటన్నింటికి భిన్నంగా ఓ సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం మొదలు పెట్టాడు. గ్రామాభివృద్ది కోసం బాండ్ పేపర్ తో గ్రామస్థుల ముందుకు వచ్చాడు.

హామీలు నెరవేర్చకపోతే.. పదవి నుంచి తొలగించండి.. బాండ్ పేపర్‌తో సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం
Tg News
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Dec 01, 2025 | 10:37 AM

Share

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు కొత్త పుంతలు తొక్కాయి. గ్రామ సర్పంచ్ అయ్యేందుకు రాజకీయ నేతలు పడుతున్న కష్టాలు అంత, ఇంత కాదు. ఏకగ్రీవం కోసమైతే ఏకంగా విలువైన భూములు, భారీగా డబ్బులు సమర్పించుకుంటున్నారు. కానీ ఓ అభ్యర్థి మాత్రం ఇందుకు బిన్నంగా హామీల పేరుతో ఏకంగా బాండ్ పేపర్ పట్టుకొని తిరుగుతున్నాడు. తనను సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామానికి ఏం ఏం చేయగలనో ఓ మేనిఫెస్టో సిద్ధం చేసుకున్నాడు సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు. ఏకంగా గ్రామ అభివృద్ధి, సంక్షేమం కోసం 22హామీలతో బాండ్ రెడి చేసి.. ప్రచారం చేస్తున్నారు.

సర్పంచ్ అభ్యర్థి 22 హామీల మేనిఫెస్టో ఇదే..

1. సల్కాపురం గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తాను

2. గ్రామ రైతు పొలాలను ట్రాక్టర్ ద్వారా దున్నుటకు, గుంటికపాయుటకు గంటకు రూ.600, కర్కేటకు గంటకు రూ.1000 మాత్రమే

3. శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర బోరు మోటర్, సెంటెక్స్ ట్యాంక్, కొళాయిల వసతి ఏర్పాటు

4. చర్చి దగ్గర బోరు మోటర్, సెంటెక్స్ ట్యాంక్, కొళాయిల వసతి ఏర్పాటు

5. కట్టమీద అవ్వ టెంపుల్ కు వెళ్ళుటకు చెరువు కట్ట తూము దగ్గర ఎక్కుటకు మెట్ల ఏర్పాటు

6. గ్రామంలో బైక్ ఉన్న ప్రతి ఒక్కరికి లైసెన్స్ కలిగి ఉండిన వారికి ఉచిత హెల్మెట్

7. బిసి స్మశాన వాటికకు ఫెన్సింగ్, నీటి వసతి కల్పిస్తాను

8. గ్రామంలో విద్య కొరకు ప్రత్యేక చొరవ

9. బీటీ రోడ్లు, సిసి రోడ్లు వేయిస్తాను

10. గ్రామంలో వితంతు మహిళలకు ఇంటి నిర్మాణం చేసుకొనుటకు రూ.10,000 ఆర్థిక సహాయం

11. వితంతు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ

12.వైద్యం కొరకు ప్రత్యేక చొరవ

13. గ్రామ ఆడపడుచులకు కళ్యాణ కానుక

14..గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అందించబడును

15. గ్రామ ప్రజలకు ప్రతి ఇంటికి కొళాయినల్ల వచ్చే విధంగా చూస్తాను

16. గ్రామంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు

17. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం

18. గ్రామంలో ఉన్న వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు, కళ్ళజోడు పంపిణీ

19. గ్రామంలో వృద్ధులకు చేతి కర్రలు, వికలాంగులకు స్టాండ్లు అందిస్తాను

20. స్కూల్ కి విద్య వాలంటరీ నియామకం

21. చదువు లేని వారికి రాత్రి బడి ఏర్పాటు

22. గ్రామంలోని కులమతాలకతీతంగా చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాల కోసం అవసరమయ్యే డీ ఫ్రీజర్, వాటర్ ట్యాంక్ ఉచితం

ఇక తనను గెలిపిస్తే ప్రతి ఏడాది 5 చొప్పున పూర్తిగా 22 హామీలు అమలు చేస్తానని బాండ్ పేపర్ లో పేర్కొన్నాడు సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు. లేని యెడల తనను సర్పంచ్ పదవి నుంచి తొలగించుటకు సల్కాపురం గ్రామస్థులకు పూర్తి అధికారం ఉంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.