హిందూపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Nandamuri Balakrishna | 107250 | TDP | Won |
Deepika T N | 74653 | YSRCP | Won |
M H Enayathulla | 8958 | INC | Won |
Swami Paripoornananda Saraswathi | 1512 | IND | Won |
M Sreeramulu | 646 | BSP | Won |
Sumalatha Madanna Gari R | 356 | IND | Won |
G.Nagaraju | 163 | JRBHP | Won |
Kodumuru Noushad | 162 | APRS | Won |
Shaik Shoukath | 131 | SP | Won |
K.Sai Nandi | 111 | IND | Won |
V.Ravindra | 113 | SUCI | Won |
G.Lokendranath | 126 | IND | Won |
Mohamed Gous | 94 | IND | Won |
ఏపీ రాజకీయాల్లో హిందూపురం నియోజకవర్గం ఎప్పుడు ముందుస్థానంలో ఉంటుందని చెప్పక తప్పదు. సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలయ్య ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తుండటమే అందుకు కారణం. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు అంచున ఉన్న హిందూపురం ఏపీ రాజకీయాలకు సెంటర్ అట్రాక్షన్. అయితే నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం ఉంది. ఇది జిల్లా కేంద్రమైన పుట్టపర్తి నుండి 67 కి.మీ,కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి 100 కి.మీ,కదిరి నుండి 95 కి.మీ దూరంలో ఉంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఒక్కసారి కూడా ఓడిపోని ఈ నియోజకవర్గాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా కైవసం చేసుకోవాలని ఈ ఎన్నికలలో పట్టుదలతో ఉంది. వెనుకబడిన సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం ఇది. 2019 నాటి ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లోని 52 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుచుకున్న మూడు స్థానాల్లో ఇదీ ఒకటి. ఈ సారి 2024 ఎన్నికల్లో మరో మారు బాలయ్య బరిలోకి దిగబోతుండగా, వైసీపీ నుంచి ఎవరో పోటీ చేస్తారు అనేది ఖరారు కాలేదు. అయితే ఈసారి మంత్రి పెద్దిరెడ్డి లాంటివాళ్లు హిందుపురం రాజకీయంలో కీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి.