శ్రీకాకుళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Gondu Shankar | 117091 | TDP | Won |
Dharmana Prasada Rao | 64570 | YSRCP | Won |
Ambati Krishna Rao | 4353 | INC | Won |
Gujjala Suryanarayana | 1388 | BSP | Won |
Panili Prasad | 615 | BCYP | Won |
Ragolu Nagasiva | 470 | JBNP | Won |
Kari Lakshmana | 308 | PPOI | Won |
శ్రీకాకుళం జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో శ్రీకాకుళం ఒకటి. ఇక్కడ నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలుగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టారు. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ ఆవిర్భావం తరువాత ఈ నియోజకవర్గ ప్రజలు టీడీపీ పార్టీని ఆదరిస్తూ వస్తున్నారు. ఇక్కడి నుంచి గుండ కుటుంబ సభ్యులే ఐదుసార్లు విజయం సాధించారు. గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గుండ లక్ష్మీదేవి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచిప ఓటీ చేసిన ధర్మాన ప్రసాదరావుపై 24,137 ఓట్ల తేడాతో ఆమె విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన గుండ లక్ష్మిదేవిపై 5777 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుపొందే నియోజకవర్గాల్లో ఒకటిగా నిలుస్తూ వస్తోంది. టీడీపీ ఆవిర్భావం తరువాత తొమ్మిది ఎన్నికలు జరగ్గా, టీడీపీ ఆరుసార్లు ఇక్కడ విజయం సాధించింది. ఆరుసార్లులో టీడీపీ నుంచి గుండ కుటుంబ సభ్యులే ఐదుసార్లు విజయం దక్కించుకున్నారు.