బుట్టా రేణుక ఎన్నికల ఫలితాలు 2024
బుట్టా రేణుక.. ఏపీ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ బుట్టా స్వస్ధలం. 1971, జూన్ 21వ తేదీన పుట్టారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ చేసారు. భర్త బుట్టా నీలకంఠం. దశాబ్దాల క్రితమే హైదరాబాద్ లో స్థిరపడ్డారు. హైదరాబాద్ లోని ప్రముఖ విద్యాసంస్ధల్లో ఒకటైన ‘మెరిడియన్’ వీరిదే. అంతేకాకుండా మద్యం వ్యాపారంలో కూడా ఉన్నారు. 2014 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కోటీశ్వరులైన ఎంపిల్లో బుట్టా కూడా ఒకరు. అఫిడవిట్ ప్రకారమే రూ. 300 కోట్ల ఆస్తులున్నాయ్. 2014 ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ స్ధానంలో వైసీపీ తరపున గెలిచారు. అయితే ఆ ఆతర్వాత చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశంపార్టీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో పోటీకి దూరంగా ఉండాల్సింది. ఆ తర్వాత వైసీపీ లో చేరింది. ప్రస్తుతం 2021 లో ఎన్నికల్లో వైపీసీ నుంచి అసెంబ్లీకి బరిలోకి దిగుతున్నారు. కర్నూలులో బుట్టా ఫౌండేషన్ స్ధాపించటం ద్వారా పేద, ప్రతిభ కలిగిన విద్యార్ధులకు స్కాలర్షిప్పులు పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటం, మహిళా సాధికారత తదితర అంశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.