జ్యోతుల నెహ్రూ ఎన్నికల ఫలితాలు 2024
జ్యోతుల నెహ్రూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కీలక రాజకీయ నాయకుడు. జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. 1994లో తొలిసారిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అనంతరం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2013లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబుపై గెలిచారు. ఆ తర్వాత 2016లో టీడీపీలో చేరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు చేతిలో ఓటమిపాలయ్యారు.